Pawan Raashii combo: పవన్‌కు జోడీగా

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:16 AM

హీరోయిన్‌ రాశీ ఖన్నా ఓ క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్నారు. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రంలో...

హీరోయిన్‌ రాశీ ఖన్నా ఓ క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్నారు. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికయ్యారు. ఇందులో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండడంతో శ్రీలీలను ఇప్పటికే ఓ కథానాయికగా ఖరారు చేశారు. మరో కథానాయికగా రాశీని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో పవన్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటోంది. సినిమాలో శక్తిమంతమైన పోలీస్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవన్‌, హరీశ్‌ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

Updated Date - Jul 21 , 2025 | 05:16 AM