సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saamrajyam: వెట్రిమారన్ 'సామ్రాజ్యం'.. ఎన్టీఆర్ మాటసాయం

ABN, Publish Date - Oct 16 , 2025 | 12:34 PM

వెట్రిమారన్, శింబు సినిమా 'సామ్రాజ్యం'కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ ప్రోమో శుక్రవారం విడుదల కానుంది.

Vetri Maaran Samrajyam Movie

తమిళ దర్శకులలో వెట్రిమారన్ (Vetrimaaran) ది ఓ ప్రత్యేక శైలి. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచి, వారి సమస్యలను తెరకెక్కించడంలో వెట్రిమారన్ దిట్ట. అంతేకాదు... వేరే దర్శకులతోనూ ఇలాంటి కథలనే సినిమాలుగా నిర్మించిన వ్యక్తి వెట్రిమారన్. తెలుగులోని స్టార్ దర్శకులతో సినిమాలు చేయాలని ఆయన కొంతకాలంగా అనుకుంటున్నారు. కానీ ఏ ప్రాజెక్ట్ కూడా సెట్ కావడం లేదు. ఎన్టీఆర్ ((NTR) తోనూ వెట్రిమారన్ సినిమా చేస్తే బాగుంటుందని భావిస్తున్న అభిమానులు చాలా మందే ఉన్నారు. ఆ మధ్య సూర్య హీరోగా వెట్రిమారన్ ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ మూవీ అనివార్య కారణాలతో ఆగిపోవడంతో ఇప్పుడు శింబు (Simbu) తో 'అరసన్' (Arasan) మూవీని చేస్తున్నాడు వెట్రిమారన్. ఈ సినిమా తెలుగు వర్షన్ కు ఎన్టీఆర్ సైతం తన గొంతుతో చేయూతనివ్వబోతున్నాడు.


శిలంబరసన్ (Silambarasan), వెట్రిమారన్ కాంబోలో తెరకెక్కుతున్న 'అరసన్'ను తెలుగులో 'సామ్రాజ్యం' (Samrajyam) పేరుతో డబ్ చేస్తున్నారు. దీని ప్రోమో శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రాబోతోంది. ఈ మధ్య ఎన్టీఆర్ 'కింగ్ డమ్' మూవీకి వాయిస్ ఓవర్ అందించాడు. ఆ సినిమాను హిందీలో 'సామ్రాజ్య' పేరుతో డబ్ చేశారు. ఇప్పుడు 'అరసన్' మూవీని తెలుగులో 'సామ్రాజ్యం'గా డబ్ చేయడం, దాని ప్రోమోకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. మొత్తానికి 'సామ్రాజ్యం' అనే టైటిల్ కు ఎన్టీఆర్ కు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమాను సీనియర్ నిర్మాత థాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు, హీరో శింబుకు మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. బేసికల్ గా మంచి సింగర్ అయిన శింబు తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు పాడాడు. అందులో ఎన్టీఆర్ 'బాద్ షా' మూవీ కూడా ఒకటి. ఇటు దర్శకుడు, అటు కథానాయకుడు ఇద్దరితో ఉన్న అనుబంధం కారణంగా 'సామ్రాజ్యం' ప్రోమోకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని అంటున్నారు.

Also Read: Anupama Parameswaran: మలయాళ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ మూవీస్

Also Read: Mithra Mandali: 'మిత్ర మండలి'  సినిమా నవ్వించిందా 

Updated Date - Oct 16 , 2025 | 12:37 PM