Vetrimaaran: నా దృష్టిలో ఆస్కార్‌ కంటే అదే గొప్పది

ABN , First Publish Date - 2023-04-21T16:32:30+05:30 IST

కళకు భాష లేదు. సరిహద్దులు లేవు అని పలువురు అంటుంటారు. కానీ, కళలకు ఖచ్చితంగా భాష ఉంది. సంస్కృతి వుంది. హద్దులు ఉంటాయి. కళలను ఆస్వాదించే ప్రేక్షకులకే

Vetrimaaran: నా దృష్టిలో ఆస్కార్‌ కంటే అదే గొప్పది
Director Vetrimaaran

ఆస్కార్‌ అవార్డు (Oscar Award)ను గెలుచుకోవడం కంటే మన నేటివిటీతో తీసే చిత్రాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే ఆస్కార్‌ అవార్డు కంటే గొప్ప విషయమని జాతీయ అవార్డు గ్రహీత (National Award Winner) వెట్రిమారన్‌ (Vetrimaaran) అన్నారు. తాజాగా చెన్నై నగరంలో సౌత్‌ ఇండియా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌ (South India Media And Entertainment Summit) జరిగింది. ఈ మీట్‌లో దర్శకుడు వెట్రిమారన్ (Director Vetrimaaran) నేటివిటీ చిత్రాలపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా వెట్రిమారన్ మాట్లాడుతూ.. ‘‘కళకు భాష లేదు. సరిహద్దులు లేవు అని పలువురు అంటుంటారు. కానీ, కళలకు ఖచ్చితంగా భాష ఉంది. సంస్కృతి వుంది. హద్దులు ఉంటాయి. కళలను ఆస్వాదించే ప్రేక్షకులకే సరిహద్దులు లేవు. వీరు సరిహద్దులను చెరిపేశారు. ఈ విషయం కరోనా మహమ్మారి సమయంలో చూశాం. ఇకపోతే, ఆస్కార్‌ అవార్డును గెలుచుకోవడం కంటే.. మన ప్రజలు, సంస్కృతి, సంప్రదాయాలతో తెరకెక్కే చిత్రాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. ఇటీవలికాలంలో దక్షిణాది చిత్రాలు దేశ చలనచిత్ర పరిశ్రమలో పెను ప్రభావాన్ని చూపించాయి. దానికి కారణం... స్థానిక ప్రజలు, స్థితిగతులు, మన భూమితో మిళితమైన కథలను చెప్పడమే. మన గుర్తింపు, ప్రత్యేకతలతో సినిమాలు తీయడమే ఈ ప్రభావానికి కారణంగా భావిస్తున్నారు. ఇదే హవా మున్ముందు కూడా కొనసాగాలి’’ అని వెట్రిమారన్‌ పిలుపునిచ్చారు. (Vetrimaaran Speech at South India Media And Entertainment Summit)

Vetri.jpg

ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘విడుదల పార్ట్ 1’ (Vidudhala Part 1) చిత్రం రీసెంట్‌గా థియేటర్లలో విడుదలై.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాని వెట్రిమారన్ తెరకెక్కించిన తీరుపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. సూరి (Soori), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇందులో ప్రధాన పాత్రలలో నటించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ (Geetha Film Distribution) ద్వారా అల్లు అరవింద్ (Allu Aravind) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Sai Madhav Burra: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర కామెంట్స్

*Malli Pelli Teaser Review: నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి.. ఎమ్మెస్ రాజు ఏంటి మాకీ కర్మ?

*Ramabanam Trailer Talk: ‘లక్ష్యం 2’ అనిపిస్తోంది

*Virupaksha Twitter Review: ‘విరూపాక్ష’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..?

*Mrunal Thakur: ఈమె ‘సీతా రామం’ సీత అంటే ఎవరూ నమ్మరు కాక నమ్మరంతే..!

Updated Date - 2023-04-21T16:32:30+05:30 IST