సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vidya Balan: సూపర్‌స్టార్‌.. చిత్రంలో బాలీవుడ్‌ నటి

ABN, Publish Date - Oct 28 , 2025 | 09:57 AM

బాలీవుడ్‌ సీనియర్‌ నటి విద్యాబాలన్‌ గురించి ఓ వార్త నేతింత వైరల్అ అవుతోంది. తమిళ సినిమాల్లో అవకాశం వచ్చిన ఆమె అక్కడ పెద్దగా రాణించలేకపోయారు. ఇప్పుడు మరో భారీ అవకాశం అందుకున్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) - యంగ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ (Nelson Dilip)దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘జైలర్‌-2’లో (jailer 2)బాలీవుడ్‌ సీనియర్‌ నటి విద్యాబాలన్‌ (Vidyabalan) అతిథి పాత్రలో నటించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ మూవీలో ప్రధాన విలన్‌గా మిథున్‌ చక్రవర్తి నటిస్తున్నారు. ఆయన కుమార్తెగా విద్యాబాలన్‌ నటించనున్నట్టు సమాచారం. ఒకపుడు అగ్రనటిగా కొనసాగిన విద్యాబాలన్‌ తమిళంలో మాత్రం రాణించలేకపోయారు.

అయితే, అజిత్‌ నటించిన ‘నేర్కొండ పార్వై’ మూవీలో తొలిసారి  గెస్ట్‌ రోల్‌ పోషించారు. ఆ తర్వాత ఇపుడు రజనీకాంత్‌ మూవీలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ కోయంబత్తూరులో శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే యేడాది వేసవిలో విడుదలకానున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ‘జైలర్‌’లో నటించిన తారాగణమంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ALSO: Divvela Madhuri: పొట్టు పొట్టున కొట్టుకున్న రీతూ - మాధురి..

Mass Jathara Trailer: ఇక్కడ సంజీవిని లేదు.. ఆంజనేయుడు రాడు.. ట్రైలర్ అదిరిపోయిందంతే

AI Film Hackathon: దేశంలో మొట్ట మొద‌టి సారి.. ఏఐ చలనచిత్రోత్సవాలు

Shilpa Shirodkar: నాడు మోహ‌న్ బాబు ‘బ్రహ్మ’.. నేడు సుధీర్ బాబు ‘జటాధర’

Updated Date - Oct 28 , 2025 | 02:23 PM