Mass Jathara Trailer: ఇక్కడ సంజీవిని లేదు.. ఆంజనేయుడు రాడు.. ట్రైలర్ అదిరిపోయిందంతే

ABN , Publish Date - Oct 27 , 2025 | 08:35 PM

మాస్ మహారాజా రవితేజ (Ravteja), శ్రీలీల(Sreeleela) జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర (Mass Jathara).

Mass Jathara

Mass Jathara Trailer: మాస్ మహారాజా రవితేజ (Ravteja), శ్రీలీల(Sreeleela) జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర (Mass Jathara). సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాపై రవితేజ, శ్రీలీలతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూడు, నాలుగుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు నవంబర్ 1 న రిలీజ్ కు సిద్దమవుతుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మాస్ జాతర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమా ఏదైనా.. హిట్ అయినా.. ఫట్ అయినా మాస్ మహారాజా ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గదు. ఈ సినిమాలో కూడా రవితేజ అదరగొట్టేశాడు.

లోకల్ డాన్ గా నవీన్ చంద్ర కనిపించాడు. లోకల్ గా నవీన్ చంద్ర అక్రమ వ్యాపారం చేస్తుంటాడు. ఆ సరుకుని రాష్ట్రం దాటించడానికి తమ ఊరి రైల్వే గేట్ దాటించాల్సి ఉంటుంది. అదే రైల్వే స్టేషన్ కు ఎస్ఐ గా రవితేజ ఉంటాడు. ఆ సరుకును ఆపడం వలన నవీన్ చంద్రకు - రవితేజకు మధ్య వైరం మొదలవుతుంది. అది ఎక్కడ వరకు వెళ్లి ఆగింది.. ? రవితేజ.. నవీన్ చంద్రను ఆపగలిగాడా.. ? మధ్యలో ఈ పోలీసోడి ప్రేమ కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

రవితేజ - పోలీస్ డ్రెస్ కు అవినాభావ సంబంధం ఉంది అని చెప్పొచ్చు. ఆ డ్రెస్ లో ఎప్పుడు రవితేజను చూసినా ఏదో తెలియని ఎనర్జీ అభిమానుల్లో కూడా వస్తుంది. ఇక ట్రైలర్ లో యాక్షన్ తో పాటు కామెడీని కూడా నింపారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్, రవితేజ, శ్రీలీల మధ్య వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని తెలుస్తోంది. ఇక విక్రమార్కుడు లో కొన్ని సీన్స్ ను రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. నవీన్ చంద్ర విలనిజం నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తోంది. కుర్ర విలన్ అయినా.. రవితేజకు ధీటుగా నటించినట్లు కనిపిస్తుంది. టోటల్ గా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Prabhas: ప్రభాస్ లుక్ ఏఐనా.. రియల్ అనుకోని మురిసిపోయామే

Pranav Mohan Lal: తెలుగులోకి.. మోహ‌న్‌లాల్ కుమారుడి చిత్రం

Updated Date - Oct 27 , 2025 | 08:35 PM