Vijay Antony: 'బూకి' సినిమాలో మంచు లక్ష్మీ...
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:40 AM
ఎట్టకేలకు విజయ్ ఆంటోని తన 'పూకి' సినిమా టైటిల్ ను 'బూకి'గా మార్చారు. అంతేకాదు... తెలుగులోనూ ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.
అజయ్ దిషన్ (Ajai Dishan), ధనుష (Dhanusha) హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర (Ganesh Chandra) దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బూకి' (Bookie). విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామాంజనేయులు జవ్వాజీ దీనిని నిర్మిస్తున్నారు. విఎఎఫ్సీ సంస్థ దీనికి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇటీవల గ్రాండ్ గా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి సత్యదేవ్ ఫస్ట్ క్లాప్ కొట్టగా, సి. కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మంచు లక్ష్మి స్క్రిప్ట్ అందించారు. విజయ్ ఆంటోని, రామాంజనేయులు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ ఆంటోని మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో విజయ్ ఆంటోనీ (Vijay Antony) మాట్లాడుతూ, 'ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ తమిళంలో మొదలైంది. సినిమా పుటేజ్ చూశాను. చాలా బాగుంది. మంచి టీమ్ తో చేస్తున్న సినిమా ఇది. డైరెక్టర్ చంద్ర 'డాక్టర్ సలీం' సినిమాకి కెమెరామెన్ గా వర్క్ చేశారు. ఈ సినిమాతో దర్శకుడు అవుతున్నారు. ఇది మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.
హీరో అజయ్ దిషన్ మాట్లాడుతూ, 'మావయ్యతో కలిసి నటించిన 'మార్గన్' సక్సెస్ ఈ సినిమా చేయడానికి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. సునీల్ గారు, లక్ష్మీ గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అని అన్నారు. ఈ సినిమాకు తనకు ఎంతో ప్రత్యేకమైనదని హీరోయిన్ ధనుష తెలిపింది. దర్శకుడు చంద్ర మాట్లాడుతూ, 'ఈ సినిమాతో నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని గారికి ధన్యవాదాలు' అని అన్నారు. ఇది అందరికీ నచ్చే యూనివర్సల్ కథ అని, ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంద'ని మంచు లక్ష్మీ తెలిపింది. యూత్ కు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను రెడీ చేశామని, చిన్నలకు, పెద్దలకు కూడా ఇది నచ్చుతుందని నిర్మాత రామాంజనేయులు చెప్పారు.
Also Read: Su from So OTT: రవన్న.. ఓటీటీకి వచ్చేశాడు! ఇక నవ్వులే.. నవ్వులు
Also Read: Champion: రోషన్ కోసం.. చంద్రకళగా తెలుగులోకి వస్తున్న అనస్వర