Margan: ‘సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో సాంగ్
ABN, Publish Date - Jun 22 , 2025 | 06:12 PM
విజయ్ ఆంటోని ‘మార్గన్’ అంటూ జూన్ 27న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు.అయన నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. జూన్ 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా సోల్ ఆఫ్ మార్గన్ అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. ‘చెప్పలేని ద్వేషముందే జగతిపై’ అంటూ సాగే ఈ 'సోల్ ఆఫ్ మార్గన్’ను చూస్తే సినిమాకు సంబంధించిన ఎన్నో హింట్స్‌ను ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. భాష్య శ్రీ రచించిన ఈ పాటను అక్షర ఆలపించారు. విజయ్ ఆంటోనీ బాణీ వెంటాడేలా, సినిమా థీమ్‌ను చాటేలా ఉంది.
Updated at - Jun 22 , 2025 | 06:12 PM