Pookie: ఇదేం.. టైటిల్‌రా నాయ‌నా! ఈ చండాలమేంది.. విజ‌య్ అంటోనీ

ABN , Publish Date - Sep 02 , 2025 | 03:56 PM

ఇటీవ‌ల విజ‌య్ అంటోని హీరోగా వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన‌ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం మార్గ‌న్.

Pookie

ఇటీవ‌ల విజ‌య్ అంటోని హీరోగా వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన‌ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం మార్గ‌న్ (Maargan). ఈ సినిమాలో విజ‌య్ మేన‌ల్లుడు అజ‌య్ దిశాన్ (Ajay Dhishan) కీ రోల్ ప్లే చేశాడు. అయితే ఇప్పుడు అజ‌య్ సోలో హీరోగా ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. ఈ సినిమాను విజ‌య్ అంటోని త‌న బ్యాన‌ర్‌లో నిర్మిస్తుండ‌గా.. గ‌తంలో ప‌లు చిత్రాల‌కు సినిబాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేసిన గ‌ణేశ్ చంద్ర ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ధ‌నూష క‌థానాయుక‌గా న‌టిస్తోంది.

Pookie

తాజాగా.. మంగ‌ళ‌వారం రోజు చైన్నైలో పూజా కార్య‌క్ర‌మాల‌తో మూవీ షూటింగ్ ప్రారంభించారు. విజ‌య్ అంటోని ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌య్యారు. పూకీ (Pookie) పేరుతో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ది కోల్డెస్ట్ ల‌వ్ హ్యాస్ మాటెస్ట్ ఎండ్ అనేది ఉప శీర్షిక‌ నాలుగైదు నెల‌ల్లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి 2026 వేస‌విలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు తీసుకు రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Pookie

అయితే స‌డ‌న్‌గా ఈ సినిమా ప్రారంభం అవ‌డం పైగా త‌మిళం, తెలుగు భాష‌ల్లో ఒకే టైటిల్‌తో వ‌స్తున్న‌ప్ప‌టికీ తెలుగుకు వ‌చ్చే స‌రికి మూవీ పేరు పూకీ (Pookie) ఘోర‌మైన‌ బూతు ప‌దం అనిపించేలా ఉండ‌డంతో చాలామంది ఇదేం పేరురా నాయ‌న అంటూ షాక్ అవుతున్నారు. వీళ్ల‌కు పేర్లే దొర‌క‌లేదా అంటూ విమ‌ర్శ‌లు గుప్తిస్తున్నారు. చూడాలి.. మ‌రి రిలీజ్ నాటికి తెలుగులో సినిమాపేరు ఏమైనా


ఇవి కూడా చ‌దవండి..

Pookie: ఇదేం.. టైటిల్‌రా నాయ‌నా! ఈ చండాలమేంది.. విజ‌య్ అంటోనీ

Su From So OTT: ఓటీటీకి.. రీసెంట్‌ హ‌ర్ర‌ర్‌, కామెడీ! పోతారు అంతా.. న‌వ్వి న‌వ్వి పోతారు

Detective Ujjwalan OTT: తెలుగులో వ‌స్తోన్న.. రీసెంట్ మ‌ల‌యాళ‌, మిస్ట‌రీ కామెడీ థ్రిల్ల‌ర్

ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే!

OG: ఇలా.. చేశారేంటి! ఓజీ గ్లిమ్స్‌పై.. అభిమానుల నిరుత్సాహం

Updated Date - Sep 02 , 2025 | 06:01 PM