Ronth OTT: సడన్‌గా.. ఓటీటీకి వచ్చేసిన పోలీస్ థ్రిల్లర్! క్లైమాక్స్ మైండ్ బ్లాకే
ABN, Publish Date - Jul 22 , 2025 | 09:33 AM
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సడన్‌గా ఓ లేటెస్ట్ మలయాళ చిత్రం రోంత్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సడన్‌గా ఓ లేటెస్ట్ మలయాళ చిత్రం రోంత్ (Ronth) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పోలీస్ ప్రోసిడ్యూరల్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా గత నెల జూన్ 13న కేరళలో థియేటర్లలో విడుదలై సైలెంట్‌గా సంచలన విజయం సాధించింది. దిలీష్ పోతన్ (Dileesh Pothan), రోషన్ మాథ్యూ (Roshan Mathew) కీలక పాత్రల్లో నటించగా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, నాయట్టు వంటి సినిమాలకు కథా రచన చేసిన షాహి కబీర్ (Shahi Kabir) రచించి దర్శకత్వం వహించాడు. రోంత్ అంటే నైట్ పెట్రోలింగ్ అని అర్థం. తెలుగులో గస్తీ, పహారా ఖాయడం అని అంటారు.
కథ విషయానికి వస్తే.. ఒక రాత్రిలో విధుల్లో ఉన్న ఇద్దరు భిన్న మనస్తత్వాలు ఉన్న పోలీసులు చాలా సీనియర్ అయున సబ్‌ఇన్స్పెక్టర్ యోహన్నాన్ (దిలీష్ పోథన్) మరియు కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్ డినానత్ (రోషన్ మాథ్యూ) ల మధ్య సాగుతుంది. ఓ రోజు రాత్రి పాట్రోల్ డ్యూటీకి వెళ్లిన ఈ ఇద్దరికి అనుకోకుండా వరుసగా ఎదురైన ఘటనలు వారిని ఎలా మార్చాయి, వారు ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి వాటికి వారు రియాక్ట్ అయిన తీరు వళ్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వచ్చిది, వారి జీవితాలు ఎలా మలుపులు తిరిగాయో థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. ఓ పిచ్చోడు బిడ్డను డ్రమ్ములో ఉంచి హింసించడం, ఓ తల్లి తన పక్కనే పిల్లలను పెట్టుకుని ఊరేసుకోవడం, ఓ ప్రేమ జంట లేచి పోవడం, వారి స్థానంలో వేరే వారిని పట్టుకోని కొట్టడం వంటి సిట్యువేషన్స్ ఎదురవుతాయి. వాటికి తోడు ఇంటి సమస్యలు, ఆ రోజే స్టేషన్‌కు వచ్చిన కేసులు ఇలా వాళ్లకు అనేక ససమస్యలు అ ఒక్క రోజులో వచ్చి మీద పడతాయి.
ఇప్పుడీ చిత్రం జియో హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు ఇతర సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పటివరకు వచ్చిన రొటీన్ కమర్షియల్ స్టోరీలా మాదిరి కాకుండా, నిజ జీవిత పోలీస్ పట్రోల్ తీరు తెన్నులను, పోలీసులు అనుభవించే సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఇద్దరు ప్రధాన పాత్రధారులు పోటీ పడి మరీ నటించారు. సినిమాటోగ్రఫీ, లైట్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చాలా సందర్బాల్లో స్లోగా సాగినప్పటికీ ఎక్కడా బోర్ అనే ఫీల్ రాదు. ఎలాంటి యాక్షన్, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ చిత్ర నిరాశే మిగులుస్తుంది. సస్పెన్స్, సీరియస్ కంటెంట్, స్లో బర్న్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ పరమాన్నం లాంటిది. అంతేకాదు స్టన్నింగ్ క్లైమాక్స్, ఊహకందని ట్విస్టులతో ఈ మూవీ షాకి ఇస్తుంది. గతంలో మలయాళం నుంచే వచ్చిన నయాట్టు, జన గణమన వంటి రియలిస్టిక్ పోలీస్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా పర్ఫెక్ట్. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు ఇంటిల్లిపాది కలిసి చూసేయవచ్చు.