Predator: Badlands: కొత్త.. ప్రిడేటర్ వచ్చేస్తున్నాడు! ట్రైలర్ గూస్‌బంప్సే
ABN , Publish Date - Jul 22 , 2025 | 02:38 PM
చాలా గ్యాప్ తర్వాత హాలీవుడ్ నుంచి ఓ ప్రిడేటర్ చిత్రం ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
చాలా గ్యాప్ తర్వాత హాలీవుడ్ నుంచి ఓ ప్రెడేటర్ చిత్రం ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ (Predator: Badlands) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. గతంలో ప్రే, 10 కల్వర్ ఫీల్డ్ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ (Dan Trachtenberg) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా 20 సెంచరీ స్టూడియోస్ (20th Century Studios) నిర్మించింది. ఎల్లే ఫానింగ్ (Elle Fanning), డిమిట్రియస్ షుస్టర్కో లోమాతంగి (Dimitrius Schuster-Koloamatangi) లీడ్ రోల్స్‌లో నటించారు. నవంబర్ 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక.. ఈ ట్రైలర్ విషయానికి వస్తే చూసే ప్రతిఒక్కరికి గూస్‌బంప్స్ వచ్చేలా ఉంది. ఇప్పటివరకు ఈ ప్రెడేటర్ సిరీస్ ఫ్రాంఛైజీలో ఆరు చిత్రాలు రాగా ఇది ఎడవ చిత్రం. అంతేగాక ఈ ఆరు చిత్రాలలో ప్రతీసారి మనుషులతోనే పోరాడిన ప్రెడేటర్.. ఈ సినిమాలో మాత్రం కథ భిన్నంగా ఉండనుంది. అనుకోకుండా ఓ గ్రహం పైకి వచ్చిన ప్రెడేటర్‌కు అక్కడి వింత, భయంకరమైన జంతువుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. అంతేగాక అక్కడే ఉండే రోబోట్స్, హై లెవల్ టెక్నాలజీని ఉపయోగించే మనుషులతోనూ పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో మొండెం వరకు మాత్రమే ఉండే ఓ యువతి ఆ ప్రెడేటర్‌కు సాయం చేస్తుంది.
ఈ క్రమంలో వారు అక్కడి నుంచి సురక్షితంగా బయట పడ్డారా లేదా, అక్కడి జంతువుల, రోబోట్స్‌ను ఎలా ఎదుర్కొన్నారనే స్టోరీతో ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ (Predator: Badlands) సినిమా ఉండనుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ను చూస్తే ఇప్పటివరకు వచ్చిన చాలా హాలీవుడ్ సినిమాలను మించిన విజువల్స్, గ్రాఫిక్స్‌ను తలదన్నేలా ఉన్నాయి. ముఖ్యంగా యానిమల్స్ అయితే నెవర్ భిఫోర్ అనేలా ఉన్నాయి. ఒక్కసారి ట్రైలర్ చూస్తే చాలు సినిమా వచ్చే వరకు ఆగడం కష్టం అనేలా అద్భుతంగా కట్ చేశారు. మీరు ఇప్పటివరకు చూడకుండా ఉంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే చూసేయండి.