OTT: తప్పిపోయిన బాలిక.. పాతికేళ్లకు చనిపోయి కనిపిస్తే! ఓటీటీలో.. అదిరిపోయే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్
ABN , Publish Date - Jul 21 , 2025 | 08:10 PM
గత వారం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన హాలీవుడ్ వెబ్ సిరీస్ అన్టేమ్డ్ అదిరి పోయే వ్యూస్‌తో ఓటీటీలో దూసుకుపోతుంది.
గత వారం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన హాలీవుడ్ వెబ్ సిరీస్ అన్టేమ్డ్ (Untamed) అదిరి పోయే వ్యూస్‌తో ఓటీటీలో దూసుకుపోతుంది. మర్డర్ మిస్టరీ డ్రామాగా వచ్చిన ఈ లిమిటెడ్ సిరీస్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎరిక్ బనా (Eric Bana) లీడ్ రోల్‌లో నటించగా సామ్ నీల్ (Sam Neill), రోజ్మేరీ డెవిట్ (Rosemarie DeWitt), లిల్లీ శాంటియాగో (Lily Santiago), విల్సన్ బెతెల్ (Wilson Bethel) ప్రధాన పాత్రల్లో నటించారు. మార్క్ L. స్మిత్ (Mark L. Smith), ఎల్లే స్మిత్ (Elle Smith) ఇద్దరు రచించి స్క్రీన్ ప్లే అందించగా థామస్ బెజుచా (Thomas Bezucha), నిక్ మర్ఫీ (Nick Murphy), నీసా హార్డిమాన్ (Neasa Hardiman) ముగ్గురు దర్శకత్వం వహించారు. మరో ముఖ్య విషయమేంటంటే వార్నర్ బ్రదర్స్ (Warner Bros. Television) సంస్థ ఈ సిరీస్‌ను నిర్మించింది.
కథ విషయానికి వస్తే.. అమెరికాలోని వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అతి పెద్ద యోస్మైట్ నేషనల్ పార్క్‌లో ఓ ఇద్దరు యువకులు మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్న సమయంలో సడన్‌గా పై నుంచి ఓ యువతి వచ్చి వారిపై పడుతుంది. వారు కొద్దిలో ప్రమాదం నుంచి బయట పడి ఈ విషయాన్ని ఆ పార్క్‌లో రేంజర్ల (పోలీసులు) దృష్టికి తీసుకెళతారు. దాంతో ఈ కేసు ఇన్వెస్టిగేటివ్ సర్వీసెస్ బ్రాంచ్ (ISB) స్పెషల్ ఏజెంట్ కైల్ టర్నర్ చంతకు వస్తుంది. ఆ యువతి పైనుంచి పడి చని పోయిందని అంతే తప్పితే అనుమానించాల్సిన ఘటనలేవని అంతా అనుకుంటారు. అయితే.. అది ఖచ్చింతంగా హత్య అని ఎవరో కావాలని అంతకుముందే చంపేసి ఇక్కడకు వచ్చి పడేశారని ఫిక్స్ అవుతాడు. తోటి వారికి చెప్పినా అంతగా పట్టించుకోరు. దీంతో తానొక్కడే దానిని నిరూపించేందుకు లోతుగా పరిశోధన స్టార్ట్ చేస్తుంటాడు. ఇదిలాఉంటే.. కైల్ టర్నర్ అదే పార్క్ పరిసరాల్లో గతంలో ఓ సైకో వళ్ల తన కుమారుడిని కోల్పోయి, మరిచిపోలేక ఆరెండ్లుగా బాధలో ఉంటునే ఉద్యోగం చేస్తుంటాడు. తన భార్యకు డైవర్స్ ఇవ్వగా అమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ ఊరిలోనే టీచర్‌గా వర్క్ చేస్తుంటుంది.
సరిగ్గా యువతి మర్డర్ జరిగిన సమయంలో నయా వాస్క్వెజ్ అనే ఓ లేడీ స్పెషల్ ఏజెంట్ అదే పార్కుకు బదిలీపై వస్తుంది. దాంతో ఈ ఇద్దరు కలిసి ఆ మర్డర్ కేసును చేధించే పనిలో పడతారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించి వాళ్ల పై అధికారుల ఒత్తిడులు పెరగడం ఎక్కువవవుతుంది. వాల్ల బాస్ సైతం వారిని చిన్న చూపు చూస్తుంటారు. కానీ వారు ఎవరేమన్నా పట్టించుకోకుండా ఆ పార్కులో కలియ తిరుగుతూ చిన్న చిన్న క్లూలను పట్టుకుని వెతుక్కుంటే పోతే ఆ కేసులో కొత్త కోణాలు బయట పడతాయి. అసలు అప్పటివరకు గుర్తు తెలియని బాడీగా అనుకున్న వారికి ఆ యువతి ఆ ఊరికి చెందిన అమ్మాయేనని, సుమారు పదేండ్ల క్రతం తప్పి పోయి ఇప్పుడు చనిపోయి కనిపించిందని తేలుతుంది. ఈ నేపథ్యంలో ఆ బాలిక అప్పుడు ఎలా తప్పి పోయింది. ఇప్పుడెలా ప్రత్యక్షమైంది, అసలు అమ్మాయిని ఎవరు, ఎందుకు చంపారు, మధ్యలో బయట పడ్డ రహాస్యలేంటి అనే ఆసక్తికర కథ కథనాలతో ఈ సిరీస్ సాగుతుంది.
మొత్తం ఆరు ఎపిసోడ్లతో వచ్చిన ఈ లిమిటెడ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాలు ఉంటుంది. ప్రతి దాంట్లో వారి ఫ్యామిలీస్, వారి మధ్య ఎమోషనల్ బాండింగ్స్ ను అద్భుతంగా చూయించారు. చాలా సన్నివేశాల్లో లాగ్ అనిపించినా అక్కడి ప్రకృతి దృశ్యాలు, వాటిని చిత్రీకరించిన విధానం మనల్ని సిరీస్‌లో లీనమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా హీరో పాత్రధారి ఫేస్ సేపు సీరిస్ చూస్తున్నంత సేపు మెస్మరైజ్ చేస్తుంది. అంతలా అతని స్క్రీన్ ప్రజెన్స్ ఉంది. ఆ తర్వాత తోటి ఏజెంట్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ప్రధానంగా విజువల్స్ వండర్ ఫుల్‌గా ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. ఎక్కడా విలన్లు, క్రూరమైన హత్యలు, చివరకు అశ్లీల, అసభ్యసన్నివేశాలు లేకుండా ఈ సిరీస్ సాగుతుంది. ఓ సన్నివేశంలో ఓ ముద్దు సన్నివేశం తప్పితే సిరీస్‌ను ఇంటిల్లిపాది చూడొచ్చు. అయితే ఎక్కడా వావ్ అనిపించే, హైప్ ఇచ్చే సన్నివేశాలు ఏవీ ఉండవు. క్లైమాక్స్ వరకు కొత్తగా ఏదో చూస్తున్నాం అనిపించినా చివరకు ఇలాంటివి మన తెలుగులో జమానాలోనే చూశాం కదా అని అనిపించక మానదు. ప్రస్తుతం ఈ అన్టేమ్డ్ (Untamed) సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.