Bigg Boss 9: డబుల్ హౌస్.. డబుల్ డోస్.. అదిరిపోయిన బిగ్ బాస్ ప్రోమో
ABN , Publish Date - Aug 10 , 2025 | 09:45 PM
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించాడని సిద్దమైపోయింది బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇక ఇప్పుడు 9 వ సీజన్ లోకి అడుగుపెడుతుంది.
Bigg Boss 9: ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించాడని సిద్దమైపోయింది బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇక ఇప్పుడు 9 వ సీజన్ లోకి అడుగుపెడుతుంది. ఇక గత 6 సీజన్స్ కు మకుటం లేని మహారాజుగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఏలుతున్న విషయం తెల్సిందే. ఈసారి అయినా కొత్త హోస్ట్ వస్తాడేమో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. కానీ, ఈసారి కూడా నాగ్ నే హోస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇక గత కొన్నిరోజులు నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమోలు ఒక్కొక్కటిగా వదులుతున్న విషయం తెల్సిందే.
ఈసారి మునపటి సీజన్స్ లా కాకుండా సామాన్యులకు పట్టం కట్టేవిధంగా సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సామాన్యుల కోసం ఆడిషన్స్ కూడా జరిగాయి. సెలబ్రిటీలకు ధీటుగా సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేయబోతున్నారు. మొదటనే నాగ్ ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పుకొచ్చాడు. ఈ ప్రోమోలో కూడా అదే చెప్తూ ఇంకో హింట్ కూడా ఇచ్చాడు. ఈసారి ఒక్క హౌస్ కాదట.. డబుల్ హౌస్ .. డబుల్ డోస్ అంటూ చెప్పుకొచ్చి ఇంకా ఆసక్తి పెంచాడు. అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ ను కూడా మార్చినట్లు తెలిపాడు. దీంతో సీజన్ 9 చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సీజన్ స్ట్రీమింగ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సీజన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.