Biggboss 9: గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 9 .. ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:18 PM
ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూసిన రియాలిటీ షో బిగ్ బాస్ 9 (Biggboss) ఎట్టకేలకు గ్రాండ్ గా మొదలయ్యింది. ఎప్పటిలానే ఈసారి కూడా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు
Biggboss 9: ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూసిన రియాలిటీ షో బిగ్ బాస్ 9 (Biggboss) ఎట్టకేలకు గ్రాండ్ గా మొదలయ్యింది. ఎప్పటిలానే ఈసారి కూడా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. సోనియా.. సోనియా అంటూ ఆయన హిట్ సాంగ్ తోనే ఎంట్రీ ఇచ్చిన నాగ్ ఒకపక్క సెలబ్రిటీలను, ఇంకోపక్క కామనర్స్ ను సమానంగా పరిచయం చేస్తూ.. ఒక్కొక్కరిని ఇంట్లోకి పంపించాడు. ఇక సోషల్ మీడియాలో వినిపించిన అన్నీ పేర్లలో సగానికి పైగా హౌస్ లో కనిపించారు.
బిగ్ బాస్ సీజన్ 9 లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అందులో 9 మంది సెలబ్రిటీస్ కాగా.. మరో 6 గురు కామనర్స్. అది కూడా అగ్ని పరీక్షలో తమ సత్తా చాటినవారు. ఆ 15 మంది ఎవరు అంటే..
సెలబ్రిటీస్:
తనూజ (సీరియల్ నటి)
ఫ్లోరా షైనీ (సినిమా నటి/ లక్స్ పాప)
ఇమ్మానుయేల్ (జబర్దస్త్ నటుడు)
స్రష్టి వర్మ (కొరియోగ్రాఫర్ )
భరణి (సీరియల్ నటుడు)
రీతూ చౌదరి( సీరియల్ నటి/ సోషల్ మీడియా ఇన్ఫ్లుయేన్సర్)
సంజనా గల్రానీ (సినిమా నటి/ బుజ్జిగాడు ఫేమ్)
రాము రాథోడ్ (ఫోక్ సింగర్/ డ్యాన్సర్)
సునీల్ శెట్టి (స్టార్ కమెడియన్)
కామనర్స్ :
కళ్యాణ్ (సోల్జర్ )
హరిత హరీష్ (మాస్క్ మ్యాన్)
డిమోన్ పవన్ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
దమ్ము శ్రీజ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
ప్రియా శెట్టి (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
మనీష్ (బిజినెస్ మ్యాన్)
వీరందరూ హౌస్ లో ఎంటర్ అయ్యారు. వీరికి రెండు హౌస్ లు ఇచ్చారు. కామనర్స్ ను హౌస్ ఓనర్స్ గా.. సెలబ్రిటీలను టెనెట్స్ గా చెప్పారు. మరి రేపటి నుంచి ఈ గేమ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
C. Nagaraju: అల్లు అరవింద్ ని వెంటాడిన మరో విషాదం
Trisha Krishnan: విజయ్ తో ఏమి లేనప్పుడు అంత సిగ్గెందుకు పడుతున్నావ్ పాప..