Bigg Boss Telugu 7: నీ కాళ్ళు పట్టుకోవాలా, రతికతో శివాజీ, ఇంతకీ ఆ వీడియోలో ఏముంది

ABN , First Publish Date - 2023-09-25T17:25:29+05:30 IST

వీడియో బయటకి వస్తే మంచిదన్న రతిక, ప్రిన్స్ యావర్ మీద రెచ్చిపోయి అరిచిన టేస్టీ తేజ, ఈవారం నామినేషన్ ల ప్రక్రియ మొదలైంది, ఇది ఈరోజు బిగ్ బాస్ లో జరగబోయేది

Bigg Boss Telugu 7: నీ కాళ్ళు పట్టుకోవాలా, రతికతో శివాజీ, ఇంతకీ ఆ వీడియోలో ఏముంది
Sivaji and Rathika

నాగార్జున (AkkineniNagarjuna) హోస్టుగా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 7 #BiggBossTelugu7 సీజన్ ఇప్పుడు నాలుగోవారానికి వచ్చేసింది. గత మూడు వారాల్లో ముగ్గురిని బయటకి పంపించేశారు, మొదటిదిగా కిరణ్ రాథోడ్ (KiranRathore), తరువాత షకీలా (Shakeela), నిన్న దామిని (Damini) బయటకి వచ్చేసారు. వీళ్ళందరూ సీనియర్ సెలబ్రిటీస్ అవటం ఆసక్తికరం. ఇప్పుడు ఒక్క శివాజీ (Sivaji) తప్పితే, ఎక్కువగా వున్నది కుర్రకారు మాత్రమే. అయితే వీళ్లందరిలో రతిక (Rathika) ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. అందరితో ఆమెకి ఎదో ఒక ప్రాబ్లెమ్ వస్తూ వుంది.

biggbosstelugu2.jpg

ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రతిక, శివాజీలా సంభాషణ చూస్తే శివాజీతో కూడా రతిక కి ఎదో ప్రాబ్లెమ్ వచ్చినట్టుంది. ఆ వీడియోస్ బయటకు రాలేదు కాబట్టి సరిపోయింది అని శివాజీ అంటే, రానివ్వు అన్నా, అవి వస్తే ఇంకా మంచిది అని రతిక చెప్పింది. ఆ సంభాషణలో ఏంటి నువ్వు నాకు క్లాసు పీకుతున్నావా, నేను ఆల్రెడీ సారీ చెప్పాను నీకు, ఇప్పుడేంటి కాళ్ళు పట్టుకోవాలా అని అడిగాడు.

ఎందుకు శివాజీ అంతలా రతిక దగ్గర బతిమాలుతూ అన్నాడు, ఈ ఇద్దరికీ ఏమైంది, అసలు ఆ వీడియో లో వున్నది ఏమిటి. ఇవన్నీ ఈరోజు తెలుస్తాయని చెప్పారు. అలాగే టేస్టీ తేజ (TastyTeja) కూడా రెచ్చిపోయాడు, నేను ఇలాగే వుంటాను, మూడు వారాలు కాదు బ్రో, 30 వారాలు అయిన నేను ఇలానే వుంటాను అని ప్రిన్స్ యావర్ (PrinceYawar) తో చెప్పాడు. ఇంతకీ అసలు ఏమి జరుగుతోంది, నామినేషన్స్ ప్రక్రియ మొదలవడం అంటే, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటమేనా.

Updated Date - 2023-09-25T17:25:29+05:30 IST