సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కుక్కల బెడద నివారణకు వర్మ మార్క్ సొల్యూషన్స్...

ABN, Publish Date - Aug 17 , 2025 | 12:00 PM

గతం కొంతకాలంగా ఢిల్లీలో వీధి కుక్కల బెడద బాగా పెరిగింది. దాంతో సుప్రీమ్ కోర్టు ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించకుండా చూడాలంటూ సంబంధిత అధికారులకు సూచన చేసింది. కుక్కలపై సుప్రీమ్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని జంతు ప్రేమికులు ఖండిస్తున్నారు.

Ram Gopal Varma

గతం కొంతకాలంగా ఢిల్లీ (Delhi)లో వీధి కుక్కల బెడద బాగా పెరిగింది. దాంతో సుప్రీమ్ కోర్టు ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించకుండా చూడాలంటూ సంబంధిత అధికారులకు సూచన చేసింది. కుక్కలపై సుప్రీమ్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని జంతు ప్రేమికులు ఖండిస్తున్నారు. అంతేకాదు... బాలీవుడ్ (Bollywood) కు చెందిన పలువురు సెలబ్రిటీస్ సైతం ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని, నోరులేని మూగ జీవుల పట్ల కనికరం చూపాలని వాపోతున్నారు. కొందరైతే కన్నీటి పర్యంతమౌతూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే అందరి దారి ఒకటైతే... మేవరిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) ది మరొకటి అని తెలిసిందే. సుప్రీమ్ కోర్టు నిర్ణయంపై ఆయన సానుకూలంగా స్పందించారు. కుక్కల కారణంగా పేద ప్రజలు, పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వర్మ కళ్ళకు కట్టినట్టుగా సోషల్ మీడియా వేదికగా వివరించారు. ఇటీవల కుక్క కాటుకు గురైన ఓ పిల్లాడికి సంబంధించిన వీడియోను వర్మ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


బాలీవుడ్ వర్గాలను ఇన్ డైరెక్ట్ గా ఉద్దేశిస్తూ, 'మీరంతా జంతు ప్రేమికులు. ఆ విషయం తెలుస్తోంది. డాగ్ లవర్స్ అయిన మీరు వాటి మీద చూపించే ప్రేమలో కొంచెమైనా వీధిలో తిరిగే పిల్లలపై చూపించపోతే ఎలా?' అని వర్మ ప్రశ్నించారు. వీధుల్లో ఉండే పిలల్లను దత్తతు తీసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళి, ఇంట్లోని కుక్కల్ని హాయిగా వీధిల్లోకి వదిలేయమని సలహా ఇచ్చారు. కుక్కల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ గా మీరు ఫీలవుతున్నప్పుడు ఆ పెంపుడు కుక్కలనే ఎందుకు పెంచుకోవడం లేదు? అని ప్రశ్నించారు. అలానే అడ్మినిస్ట్రేటర్స్ స్థానంలో కుక్కలను పెడితే బాగుంటుందని, అవి కనీసం మౌనంగా ఉండకుండా అరుస్తుంటాయని సెటైర్ వేశారు. కుక్కలకు స్టెరిలైజ్ చేసే బదులు డాగ్ లవర్స్ తమ భావాలను స్టెరిలైజ్ చేసుకుంటే బాగుంటుందని, ఆ రకంగా వాటిని అదుపు చేయొచ్చని అన్నారు. 'మీ పిల్లలను వీధి కుక్కలతో ఆడుకోవడానికి ఎందుకు పంపడం లేద?ని అడిగారు. కుక్కలను స్వేచ్ఛగా వీధుల్లో తిరగనివ్వాలని చెప్పేవారు తమ ఏసీ బంగ్లాలో ఉన్న పెంపుడు కుక్కల్ని కూడా వీధిలోకి వదిలేస్తే బాగుంటుందని అన్నారు. పిల్లల కంటే కుక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకునే వారు... వాటి కోసం స్కూల్ ప్రారంభిస్తే బాగుంటుందని, అలానే పిల్లల కోసం బోనులు తయారు చేయొచ్చని సలహా ఇచ్చారు. వీలైతై వీరంత కలిసి 'అడాప్ట్ ఏ డాగ్, కిల్ ఏ చైల్డ్' పేరుతో ఓ ఫౌండేషన్ పెడితే బెటర్ అని వర్మ సలహా ఇచ్చారు.


వర్మ జంతు ప్రేమికుల మీద చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. వర్మ ఇలా కాకుండా ఎలా మాట్లాడతారని కొందరంటే... చిన్నారులపై వర్మకు ఉన్న కన్సర్న్ తమను ఆశ్చర్యానికి గురిచేసిందని మరికొందరు అంటున్నారు.

Also Read: Shalini Pandey: ఇడ్లీ కొట్లో... ధనుష్ చెల్లిగా...

Also Read: Pragathi: అది ఈ నొప్పులు, బాధల కన్నా గొప్పది

Updated Date - Aug 17 , 2025 | 12:03 PM