Shalini Pandey: ఇడ్లీ కొట్లో... ధనుష్ చెల్లిగా...
ABN , Publish Date - Aug 17 , 2025 | 09:28 AM
ధనుష్ హీరోగా నటిస్తూ, డైరెక్షన్ చేస్తున్న సినిమా 'ఇడ్లీ కడై' లో షాలినీ పాండే నటిస్తోంది. ఇందులో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుండగా, హీరో చెల్లి పాత్రను షాలినీ పోషిస్తోంది.
'అర్జున్ రెడ్డి' (Arjun Reddy) మూవీతో ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్న షాలినీ పాండే (Shalini Pandey) ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించింది. అయితే 'అర్జున్ రెడ్డి' లాంటి సక్సెస్ కానీ, ఆ స్థాయి గుర్తింపు గానీ అమ్మడికి మరే సినిమాతోనూ దక్కలేదు. ఆశించిన స్థాయి విజయాలు దక్కకపోవడంతో తెలుగులో నిదానం గా ఫేడ్ అవుట్ అయిపోయింది షాలినీ. అనుష్క (Anushka) పాన్ ఇండియా మూవీ 'నిశ్శబ్దం' (Nissabdham) తర్వాత షాలినీ పాండే మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు. అలానే తమిళంలోనూ కెరీర్ ప్రారంభంలో '100 పర్శంట్ కాదల్', 'గొరిల్లా' సినిమాల్లో షాలినీ పాండే నటించింది. ఈ రెండు సినిమాలు మంచి ఆదరణే అందుకున్నాయి. కానీ ఆ తర్వాత అక్కడ కూడా ఎందుకో షాలినీకి అవకాశాలు రాలేదు. ఈ మధ్యలో వివాదాస్పదమైన స్టేట్ మెంట్స్ కారణంగానే ఆమె వార్తల్లో నానింది.
విశేషం ఏమంటే... ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తూ, డైరెక్షన్ చేస్తున్న సినిమా 'ఇడ్లీ కడై' (Idly kadai)లో షాలినీ పాండే నటిస్తోంది. ఇందులో హీరోయిన్ గా నిత్యా మీనన్ (Nithya Menon) చేస్తుండగా, హీరో చెల్లి పాత్రను షాలినీ పోషిస్తోంది. అయితే... ఆమె పాత్రకూ చక్కని ప్రాధాన్యమే ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఆరేళ్ళ తర్వాత షాలిని ఈ పాత్రతో రీ-ఎంట్రీ ఇస్తోందేమిటీ? అని సందేహం వెలిబుచ్చుతున్న వారూ లేకపోలేదు. సమ్ థింగ్ ఈజ్ బెటర్ దేన్ నథింగ్ అనే పాలసీని అనుసరిస్తూ షాలినీ 'ఇడ్లీ కడై'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆమె అభిమానులు సర్థిచెప్పుకుంటున్నారు.
Also Read: Shootings Bandh: చిరు మధ్యవర్తిత్వంతో కొలిక్కి వస్తుందా..
Also Read: Pragathi: అది ఈ నొప్పులు, బాధల కన్నా గొప్పది