Disha Patani: లెక్క సరిచేసిన యోగి ఆదిత్యనాథ్
ABN, Publish Date - Sep 18 , 2025 | 04:32 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిపిన అగంతులను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పోలీసులను తప్పించుకుని నిందితులు పారిపోయే ప్రయత్నంగా చేయగా ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
ముప్పై మూడేళ్ళ దిశా పటానీ (Disha Patani) తన కెరీర్ ను తెలుగు సినిమా 'లోఫర్'తోనే మొదలు పెట్టింది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించిన దిశా బేబీ లాస్ట్ ఇయర్ ప్రభాస్ 'కల్కి 2898ఎ.డి.' (Kalki 2898 A.D) లో హీరోయిన్ గా నటించింది. అయితే ఇటీవల తన నటనకు సంబంధించి కాకుండా వేరే అంశంతో దిశాపటానీ వార్తల్లో నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో దిశా పటానీ ఇంటి ముందు కొందరు కాల్పులు జరిపి, హంగామా సృష్టించారు. ఆమె సోదరి ఓ మత వర్గం మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడిందని, వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని, వారి అంతుచూసే వరకూ వదలమంటూ ఆ వ్యక్తలు బీరలు పలికారు. ఇది అంతం కాదు ఆరంభం అంటూ వ్యాఖ్యలు చేశారు.
దిశా పటానీ ఇంటి ముందు జరిగిన ఈ గొడవ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ (Yogi Adityanadh) దృష్టి చేరింది. ఆయన దిశా పటానీ తండ్రితో మాట్లాడి, ఆయనకు ధైర్యం చెప్పారు. వారిని బెదిరించిన వ్యక్తులు ఎవరైనా వారిని గుర్తించి, తప్పకుండా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు లభించిన ఆధారంగా వారు గోల్డీ బ్రార్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన యూపీ టాస్క్ ఫోర్స్, దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దిశా ఇంటి ముందు కాల్పులు జరిపింది రవీంద్ర, అరుణ్ గా గుర్తించారు. బుధవారం నిందితుల్ని గాజియాబాద్ లోని ట్రోనికా సిటీ వద్ద పోలీసులు నిలువరించారు. వారు తప్పించుకుని పారిపోతున్న క్రమంలో ఎన్ కౌంటర్ చేశారు. దానికి ముందు నిందితులు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. సహజంగా బాలీవుడ్ ప్రముఖులను అండర్ వరల్డ్ బెదిరించి, తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం ముంబై వంటి నగరాల్లో జరుగుతూ ఉండేది. కానీ ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఇలాకా కావడం ఆయన అలాంటి అండర్ వరల్డ్ గ్యాంగ్స్ కు తనదైన రీతిలో బుద్ధి చెప్పారని స్థానికులు అంటున్నారు. సాధారణ ప్రజలను, సినిమా తారలను బెదిరించడానికి ఎవరూ ప్రయత్నించినా పర్యవసానం ఇలాంటి ఉంటుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పకనే చెప్పారని వారు భావిస్తున్నారు.
Also Read: OG Movie: ఫ్యాన్స్ ఓపిక పట్టండి.. ట్రైలర్ వచ్చేస్తుంది
Also Read: Deepika Padukone.: అల్లు అర్జున్ సినిమానే కారణమా...