Disha Patani Yogi Adityanath: ఎంతటి వారైనా.. వదిలేది లేదు
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:08 PM
“దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన అనంతరం ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమె కుటుంబానికి పూర్తి భద్రతను హామీ ఇచ్చారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.”
బాలీవుడ్ నటి దిశా పటానీ (Disha Patani) కుటుంబానికి పూర్తి భద్రత కల్పిస్తామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తాజాగా హామీ ఇచ్చారు. ఇటీవల సెప్టెంబర్ 12న యూపీలోని బరేలీ ప్రాంతంలో దిశా పటానీ ఇంటి బయట కాల్పులు (UP Firing) చోటు చేసుకున్న నేపథ్యంలో సీఎం యోగి స్వయంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన దిశా తండ్రి జగదీశ్‌కు ఫోన్ చేసి, కాల్పులకు పాల్పడిన నిందితులను ఎంతటివారైనా వెతికి పట్టుకుంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం.. సీఎం మాటలతో తమ కుటుంబానికి ధైర్యం కలిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని జగదీశ్ మీడియాకు తెలిపారు. భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని, అండర్‌గ్రౌండ్‌లో దాగిన నిందితులను కూడా పట్టుకుంటామని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి గ్యాంగ్‌స్టర్ గోల్టీ బ్రార్ (Goldy Brar) గ్యాంగ్ తమ పేరు ప్రకటిస్తూ, ఆధ్యాత్మిక గురువులు అనిరుద్దాచార్య (Aniruddhacharya ), ప్రేమానంద్ జీ మహారాజ్ (Premanand Ji Maharaj) పై చేసిన వ్యాఖ్యల కారణంగా దిశా పటానీ సోదరి రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ ఖుష్బూ పటానీని (Khushboo Patani) టార్గెట్ చేశామని తెలిపింది. నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన నిందితులు బైక్‌పై పరారయ్యారు. ఇదే కేవలం ప్రారంభమని, ఇంకా పెద్ద చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రస్తుతం ఖుష్బూ పటానీ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తుండగా, ఆమె మాజీ ఆర్మీ అధికారిణిగా కూడా గుర్తింపు పొందారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, దిశా పటానీ (Disha Patani)పై అండర్ వరల్డ్ డాన్ల కన్ను పడిందన్న వార్తలు ఆమె కుటుంబ భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.