Sonakshi Sinha: 'జటాధర' విడుదలకు ముందే...

ABN , Publish Date - Aug 07 , 2025 | 06:06 PM

కాస్తంత ఆలస్యంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శతృఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటోంది. తొలి తెలుగు సినిమా 'జటాధర' విడుదలకు ముందే ఆమెకు మరో ఛాన్స్ దక్కింది.

Sonakshi Sinha

ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా (Shatrughan Sinha) కుమార్తె సోనాక్షి (Sonakshi Sinha) పదిహేనేళ్ళ క్రితం 'దబంగ్' (Dabangg) మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఆమెకు ఆ తర్వాత గొప్ప విజయాలు దక్కకపోయినా.. అవకాశాలకు మాత్రం కొదవలేకుండా ఉంది. రజనీకాంత్ (Rajinikanth) 'లింగ' (Linga) సినిమాతో తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా... ఇంతకాలానికీ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. సుధీర్ బాబు (Sudheerbabu) నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ 'జటాధర' లో ఆమె నటిస్తోంది. 'హీరామండి' వెబ్ సీరిస్ తో నటిగా మరో మెట్టు ఎక్కిన సోనాక్షి సిన్హా కోసం కొందరు రచయితలు ప్రత్యేక పాత్రలు రాయడం మొదలు పెట్టారు.


ఈ యేడాది జూలై 18న ఆమె నటించిన 'నికితారాయ్' (Nikita Roy) మూవీ విడుదలైంది. దీన్ని ఆమె సోదరుడు కుశ్‌ సిన్హా డైరెక్ట్ చేశాడు. మూవీకి మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఆమె తన తొలి తెలుగు సినిమా 'జటాధర' పై ఆశలు పెట్టుకుంది. విశేషం ఏమంటే... ఈ సినిమా విడుదల కాకముందే తెలుగులో సోనాక్షి సిన్హాకు మరో అవకాశం వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు సోనాక్షి సైన్ చేసిందని అంటున్నారు. ఇటీవలే వివాహబంధంలోకి కూడా అడుగుపెట్టిన సోనాక్షి సినిమా... పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు అనే పంథాను ఫాలో అవుతోంది. విశేషం ఏమంటే... ఆమె తండ్రి శతృఘ్న సిన్హా సైతం తెలుగులో 'మేధావి' అనే మూవీలో ఎప్పుడో నటించారు. ఆయన నటించిన పలు హిందీ సినిమాలు తెలుగులోనూ రీ-మేక్ అయ్యాయి. ఆ రకంగా తండ్రి బాటలోనే తెలుగువారిని పలకరించడానికి సోనాక్షి వస్తోందనుకోవచ్చు.

Also Read: Rajinikanth: హిందీ బెల్ట్‌లో 'కూలీ' హంగామా

Also Read: TG Vishwa Prasad: వీరమల్లుకు సాయం చేశా.. కానీ అందుకోసం కాదు..

Updated Date - Aug 08 , 2025 | 07:17 AM

Sonakshi Sinha: కారణం ఏదైనా అదే ధ్యాసలో ఉంటున్నారు.. సోనాక్షి కౌంటర్‌

Sonakshi Sinha: అలాంటి సినిమాల జోలికి వెళ్లను

Sonakshi Sinha: ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా..!

Sonakshi Sinha: జటాధర కోసం సోనాక్షిసినా ఎంట్రీ..

Sonakshi Sinha: పెళ్లి పీట‌లెక్కుతోన్న ద‌బాంగ్ బ్యూటీ.. న‌టుడితో ప్రేమలో బాలీవుడ్ రెబ‌ల్ స్టార్ కూతురు