Rajinikanth: హిందీ బెల్ట్‌లో 'కూలీ' హంగామా

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:51 PM

రజనీకాంత్ 'కూలీ' సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అనుకున్నారు. సూపర్ స్టార్ స్టామినా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టే అన్ని ప్లాన్లు వేసుకున్నారు కానీ ఒక్క ప్రాబ్లమ్ మేకర్స్ ను కలవరపెడుతోంది. అందుకే ఇప్పుడు ప్లాన్ బి అమలు చేయడానికి రెడీ అయిపోయారు.

ఇండియన్ ఫిల్మ్ లవర్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్న మూవీల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన 'కూలీ' (Coolie) ఒకటి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా గ్లోబల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని మేకర్స్ ధీమాలో ఉన్నారు. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమా హిందీ బెల్ట్‌లో బాగా ఆడితేనే ఇన్వెస్ట్‌మెంట్ రికవరీ అవుతుంది. కానీ, ఈ సినిమాకు నార్త్‌లో భారీ పోటీ ఎదురవుతోంది. హిందీలో 'వార్ 2'తో (war 2) డైరెక్ట్ క్లాష్ అవుతుండటంతో గట్టి పోటీ తప్పేలా లేదు. హిందీ బెల్ట్‌లో 'కూలీ' సత్తా చాటాలంటే మేకర్స్ స్ట్రాటజీ కీలకం కానుంది. దీంతో నార్త్‌లో వీలైనంత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ముంబైలో ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.


'కూలీ' మూవీలో ఆమిర్ ఖాన్ క్యామియో రోల్‌ చేస్తున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్ మ్యూజిక్ కంపోజర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఇద్దరినీ ప్రమోషన్స్‌లో సమర్థవంతంగా వాడుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే 'జవాన్' సినిమాకి అనిరుధ్‌ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. అందుకే ముంబై ఈవెంట్‌లో అనిరుధ్‌ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేస్తున్నారట. 'కూలీ' మ్యూజిక్ ఆల్బమ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ, 'మోనికా' సాంగ్ ఖచ్చితంగా హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌ ఈవెంట్స్ ముగిశాయి. ముంబై ఈవెంట్ సినిమా హైప్‌ని పీక్స్‌కి తీసుకెళ్లడంలో కీలకంగా మారుతుందని నిర్మాత కళానిధి మారన్, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్ భావిస్తున్నారు. అందుకే మెయిన్ కాస్ట్ అండ్ క్రూ ఈ ఈవెంట్‌కి హాజరవుతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే నార్త్‌లోని ఎక్కువ శాతం మల్టీప్లెక్స్‌ థియేటర్లు 'వార్ 2' కోసం స్క్రీన్స్ లాక్ చేస్తున్నాయి. 'కూలీ'కి స్క్రీన్స్ ఇవ్వడానికి అంతగా కో-ఆపరేట్ చేయడం లేదని తెలుస్తోంది. కానీ ఆమిర్ ఖాన్ ఐనాక్స్, పీవీఆర్ అధికారులతో చర్చలు జరుపుతూ 'కూలీ'కి ఐమాక్స్ చైన్స్‌లో సరైన హిందీ రిలీజ్ సాధించేందుకు ట్రై చేస్తున్నాడట. ఈ చర్చలు సఫలీకృతం అయితే... 'కూలీ' కూడా 'వార్ 2' తో సమానంగా థియేటర్లలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో చూడాలి.

Updated Date - Aug 07 , 2025 | 03:56 PM