Sonakshi Sinha: పెళ్లి పీట‌లెక్కుతోన్న ద‌బాంగ్ బ్యూటీ.. న‌టుడితో ప్రేమలో బాలీవుడ్ రెబ‌ల్ స్టార్ కూతురు

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:00 PM

బాలీవుడ్ రెబ‌ల్ స్టార్ శత్రుఘ్న సిన్హా వార‌సురాలు, న‌టి సోనాక్షి సిన్హా త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఓ చిత్రంలో త‌న ప‌క్క‌న న‌టించిన జహీర్‌ ఇక్బాల్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న ఈ చిన్న‌ది ఎట్ట‌కేల‌కు త‌మ బంధాన్ని బ‌హిర్గ‌తం చేసింది.

Sonakshi Sinha: పెళ్లి పీట‌లెక్కుతోన్న ద‌బాంగ్ బ్యూటీ.. న‌టుడితో ప్రేమలో బాలీవుడ్ రెబ‌ల్ స్టార్ కూతురు
sonakshi sinha

బాలీవుడ్ రెబ‌ల్ స్టార్ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) వార‌సురాలు, న‌టి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధ‌మ‌వుతోంది. 2010లో స‌ల్మాన్ ఖాన్ ద‌బాంగ్ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పుష్క‌ర కాలంగా బాలీవుడ్ త‌న‌దైన శైలిలో 35కు పైగా సినిమాలు చేసి విజ‌య‌వంతంగా సాగుతోంది. గ‌త సంవ‌త్స‌రం వెబ్ సిరీస్‌ల‌లోకి కూడా అడుగుపెట్టిన ఈ భామ అక్క‌డా త‌న స‌త్తా చాటుతోది. లేటెస్ట్‌గా సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హీరామండి (Heeramandi) అనే సిరీస్‌లో ముఖ్య పాత్ర‌లో న‌టించి మెప్పించింది.

GPsVKWGWQAA_alc.jpeg

2022లో వ‌చ్చిన డ‌బుల్ ఎక్స‌ల్ (Double XL) అనే చిత్రంలో త‌న ప‌క్క‌న హీరోగా న‌టించిన జహీర్‌ ఇక్బాల్‌ (Zaheer Iqbal)తో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న ఈ చిన్న‌ది ఎట్ట‌కేల‌కు త‌మ ప్రేమ వివాహాన్ని బ‌హిర్గ‌తం చేసింది. అంతేకాదు పెద్ద‌ల అంగీకారం రావ‌డంతో ఈనెల 23న ముంబైలో పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పైగా పెళ్లి ప‌త్రిక‌లు కూడా రెడీ అవ‌డం గెస్ట్ల‌కు పంచ‌డం కూడా జ‌రుగుతోంద‌ని వార్తా ప‌త్రిక‌లు స్ఫ‌స్టం చేస్తున్నాయి.

GPtGXYTXMAARKju.jpeg


కాగా వీరి ఆహ్వ‌న ప‌త్రిక‌ను చాలా డిఫ‌రెంట్గా త‌యారు చేయించార‌ని వాటిపై ‘ది రూమర్స్‌ ఆర్‌ ట్రూ.. ’ అనే మాట ఉన్న‌ట్లు ప్ర‌చురిస్తున్నాయి. ఇదిలాఉండ‌గా సోనాక్షి సిన్హా ప్ర‌స్తుతం రెండు హిందీ చిత్రాల‌లో న‌టిస్తుండ‌గా.. జహీర్‌ ఇక్బాల్‌ (Zaheer Iqbal) ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్ న‌టించిన కిసికా భాయ్ కిసికా జాన్‌, నోట్ బుక్ అనే మ‌రో రెండు హిందీ చిత్రాల‌లోను న‌టించాడు. వీరి వివాహానికి స‌మీప బంధువులు, సినిమా రంగం నుంచి కొద్ది మంది మాత్ర‌మే హ‌జ‌రు కానున్నారు.

sonakshi.jpg

Updated Date - Jun 10 , 2024 | 11:00 PM