TG Vishwa Prasad: వీరమల్లుకు సాయం చేశా.. కానీ అందుకోసం కాదు..
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:46 PM
పవన్ కల్యాణ్ (Pawan kalyan) కుమారుడు అకీరా (Akira Nandan) గురించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ (Pawan kalyan) కుమారుడు అకీరా (Akira Nandan) గురించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఏ నిర్మాతకైనా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఆయన రాజాసాబ్’తో పాటు చిత్రాలను నిర్మిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘హరిహర వీరమల్లు’ (harihara Veeramallu) సినిమాకు ఆయన చేసిన సాయం గురించి మాట్లాడారు.
‘‘అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్మాతలందరికీ ఉంటుంది. నాకు అవకాశం వస్తే కచ్చితంగా సినిమా చేస్తాను. అయినా.. అకీరా ఎవరితో సినిమా చేయాలనేది సమయం తీసుకొని అతడే నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాని కోసమే నేను ‘హరిహర వీరమల్లు’కు సాం చేయలేదు. ఏఎం రత్నంకు అప్పుడు నా అవసరం ఉందనిపించింది. నా వంతుగా చేశాను. ఆ సమయంలో పవన్ నన్ను చూశారు. ‘వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుకలో అందుకే థాంక్స్ చెప్పారు. అకీరాతో సినిమా చేయాలనే తపనతో నేను ఆ సాయం చేశాను అనడం కరెక్ట్ కాదు. అది అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. మాళవిక మోహనన్, నిధీ అగర్వాల్ నాయికలు. దీని గురించి చెబుతూ ‘సెప్టెంబర్‌లో ఈ సినిమా నుంచి ఎక్కువ అప్‌డేట్స్ వస్తాయి. అక్టోబర్ నాటికి సినిమా అంతా పూర్తవుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 5న విడుదల చేయాలని అనుకుంటున్నాం. కానీ జనవరిలో రిలీజ్ చేయాలని చాలామంది కోరుతున్నారు త్వరలో దీనిపై తుది నిర్ణయం చెబుతాం’ అన్నారు.