Ashwin Kumar-Ramayana: ఇండస్ట్రీని మలుపు తిప్పే సినిమా అవుతుంది..
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:02 PM
ఆదిపురుష్ ఫెయిల్యూర్‌కి చాలా కారణాలున్నాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోలేం. కానీ, ఆ టీమ్ ఆ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారో అర్థమైంది.
నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘రామాయణ’ (Ramayana) సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ప్రపంచం మొత్తం భారత సినిమా వైపు చూసేలా ఈ చిత్రం ఉండబోతోందని నిర్మాత నమిత్ మల్హోత్ర (Namith Malhotra) స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయన మాటలకు తగ్గట్టే ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ గ్రాండ్‌గా ఉంది. దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి దాకా ఇండియాలో తెరకెక్కిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ సినిమాగా చెబుతున్నారు విశ్లేషకులు. తాజాగా ఈ చిత్రంపై దర్శకుడు అశ్విన్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ఇండస్ట్రీని ఒక మలుపు తిప్పుతుందన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మహావతార్: నరసింహ’ చిత్రం జులై 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మైథలాజికల్ సినిమాల గురించి ప్రస్తావించారు.
‘‘ఆదిపురుష్’ ఫెయిల్యూర్‌కి చాలా కారణాలున్నాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోలేం. కానీ, ఆ టీమ్ ఆ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారో అర్థమైంది. దానినుంచి ఇండస్ట్రీ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ఇలాంటి గొప్ప కథలు ఎన్నిసార్లు రూపొందించినా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఇప్పుడు ఇదే కథపై బాలీవుడ్‌లో రామాయణ వస్తుంది. అందరి ఆశలు ఆ చిత్రంపైనే ఉన్నాయి. అది ఇండస్ట్రీలో చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం నాకు ఉంది. సినిమాకు బడ్జెట్ మాత్రమే ప్రామాణికం కాదు. కథను ఎలా చూపిస్తామనేది చాలా ముఖ్యం. ‘మహావతార్: నరసింహ’ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. పురాణాల ఆధారంగా తెరకెక్కించే కథలకు త్వరలోనే డిమాండ్ పెరగనుంది’ అని అన్నారు. హోంబలే ఫిల్మ్స్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో ఏడు సినిమాలను రూపొందించనుంది. విష్ణుమూర్తి పది అవతారాలపై సినిమాలను నిర్మించనుంది. వాటి నుంచి వస్తున్న మొదటి చిత్రమే ‘మహావతార్: నరసింహ’. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి.. బావుంటాయ్
MM Keeravani Surprise: అప్పుడు రాజమౌళి కోసం.. ఇప్పుడు పవన్ కోసం.. ఫ్యాన్స్‌కి పండగే
తప్పిపోయిన బాలిక.. పాతికేళ్లకు చనిపోయి కనిపిస్తే! అదిరిపోయే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్