Aamir Khan: రూ. 2 వేల కోట్ల ఆస్తులకు అధిపతి.. కానీ, అద్దె ఇంట్లో .. ఎందుకో తెలుసా
ABN , Publish Date - Aug 05 , 2025 | 08:14 PM
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్(Aamir Khan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖాన్ త్రయంలో ఒకరిగా కొనసాగుతున్న ఆమీర్.. హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించాడు.
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్(Aamir Khan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖాన్ త్రయంలో ఒకరిగా కొనసాగుతున్న ఆమీర్.. హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఇక అలాంటి హీరో ఎంత లగ్జరీగా జీవిస్తాడో అందరికీ తెల్సిందే. అయితే ప్రస్తుతం ఆమీర్ మాత్రం ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు అని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఏంటి నిజమా.. ఆమీర్ అద్దె ఇంట్లో ఉండడం ఏంటి.. ? ఆయనకు అసలు ఆస్తులు లేవా.. ? అనే అనుమానాలు వస్తే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఆమీర్ ఖాన్ కి విర్గో కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో దాదాపు 12 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా బాంద్రాలో ఒక లగ్జరీ ఇల్లు ఉంది. టోటల్ గా ఆమీర్ నెట్ వర్త్.. సుమారు రూ. 20 వేల కోట్లకు పైమాటే. అయినా కూడా ప్రస్తుతం ఆమీర్ బాంద్రా వెస్ట్ లోని పాలిహిల్ ఏరియాలో నర్గీస్ దత్ రోడ్ లో ఉన్న విల్నోమోనా అనే సొసైటీలోనాలుగు ఫ్లాట్స్ ను అద్దెకు తీసుకున్నాడు. ఒక్కో ఫ్లాట్ కి రూ. 24. 5 లక్షలు కట్టి అద్దెకు ఉంటున్నాడు.
అసలు ఆమీర్ ఇలా సొంతిల్లు పెట్టుకొని అద్దెఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి అంటే.. ప్రస్తుతం సొసైటీలో డెవలప్ మెంట్ పనులు జరుగుతున్న కారణంగా ఆయన ఆ 12 ఇళ్లను వదిలేసి అద్దె ఇంట్లో ఉంటున్నాడని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. త్వరలోనే మళ్లీ ఆమీర్ తన సొంత ఇంటికి వెళ్లనున్నాడని సమాచారం. ఇక ఆమీర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో గెస్ట్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఆమీర్ కు ఎలాంటి పేరు వస్తుందో చూడాలి.
Jr Ntr: ఏదీ ప్లాన్ చేయను.. కానీ అలా గుర్తుండిపోవాలనుకుంటా..
Athadu Re-Release : 'అతడు' భారీ కటౌట్స్