Aamir Khan: ఆ సినిమా తర్వాత చేయడానికి ఇంకేం ఉండదు
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:15 PM
ఆమిర్‌ఖాన్ (Aamir Khan) హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ (sitaare zameen par) సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది.
ఆమిర్‌ఖాన్ (Aamir Khan) హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ (sitaare zameen par) సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఆమిర్‌ఖాన్ ప్రచారాల్లో భాగంగా బిజీ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ుూతన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఆ తర్వాత తాను నటనకు స్వస్తి పలికే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. ‘‘ఇప్పటికి నా ఫోకస్ మొత్తం ‘సితారే జమీన్ పర్’ సినిమాపైనే. మహాభారతం ఆధారంగా చేసుకుని ఒక భారీ ప్రాజెక్ట్ తీయాలనేది నా కోరిక. ప్రస్తుత సినిమా విడుదలయ్యాక నా డ్రీమ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెడతాను. దానిని భారీ స్థ్థాయిలో రూపొందించాలని అనుకుంటున్నా. ప్రపంచంలో చూసే ప్రతి విషయం మహాభారతంలో భాగమే. ఇందులో ఎన్నో కోణాలు, భావోద్వేగాలు ఉన్నాయి.
నేటితరం ప్రేక్షకులకు దానిని అందించాలంటే భారీ స్థాయిలోనే సిద్థం చేయాల్సి ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథతో ప్రయాణం చేస్తున్నా. వెండితెర వేదికగా అద్భుతంగా దీనిని ప్రేక్షకులకు చూపించాలని కలలు కంటున్నా. అయితే ఈ సినిమా తర్వాత ఇండస్ర్టీలో నటుడిగా చేయడానికి ఇక ఏమీ లేదనే భావన కలుగుతుంది. ఒక నటుడిగానే నాకు చనిపోవాలని ఉంది’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు.