Aamir Khan : మూడో పెళ్లికి సిద్ధమవుతున్నారా?
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:49 AM
ఆరు పదుల వయసులో ఉన్న బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ మళ్లీ ప్రేమలో పడ్డారు. బెంగళూరుకి చెందిన ఓ యువతితో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నారనీ, ఇటీవలే ఆమెను తన కుటుంబ
ఆరు పదుల వయసులో ఉన్న బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ మళ్లీ ప్రేమలో పడ్డారు. బెంగళూరుకి చెందిన ఓ యువతితో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నారనీ, ఇటీవలే ఆమెను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశారనీ బీ టౌన్‌లో జోరుగా వినిపిస్తోంది. ఆమె ఎవరో వివరాలు తెలియక పోయినా ఆమీర్ ప్రేమకు ఆయన కుటుంబ సభ్యులు ఆమోద ముద్ర వేశారనీ, ఇక వారి పెళ్లి జరగడమే మిగిలిందని అంటున్నారు. ఇది ఆయనకు మూడో పెళ్లి అవుతుంది. ఆమీర్ ఖాన్ తొలి వివాహం 1986లో రీనా దత్తాతో జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.. జునైద్ , ఐరా ఖాన్. 2002లో భార్య నుంచి విడిపోయారు ఆమీర్. ఆ తర్వాత దర్శకురాలు కిరణ్ రావుతో నాలుగేళ్లు డేటింగ్ చేసి, 2005లో ఆమెని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమారుడు ఆజాద్ ఉన్నాడు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేసి 2021లో ఆమీర్, కిరణ్ రావు విడాకులు తీసుకున్నారు. మరి ఆమీర్ ఖాన్ మూడో పెళ్లి ఎప్పుడో!
Also Read : దమ్ముంటే అక్కడికి రా.. నువ్వో నేనో చూసుకుందాం..
Also Read : ‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’
Also Read : సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు.. అసలు విషయం ఏమిటంటే..?