scorecardresearch

Aamir Khan: ఆమిర్‌ఖాన్‌తో లోకేశ్‌ సినిమా

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:23 AM

విలక్షణ నటుడు ఆమిర్‌ఖాన్‌ బాస్కెట్‌ బాల్‌ కోచ్‌గా నటించిన ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. ఇందులో జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత తమిళ...

Aamir Khan: ఆమిర్‌ఖాన్‌తో లోకేశ్‌ సినిమా

విలక్షణ నటుడు ఆమిర్‌ఖాన్‌ బాస్కెట్‌ బాల్‌ కోచ్‌గా నటించిన ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. ఇందులో జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ సూపర్‌ హీరో కథాంశంతో రూపొందించే చిత్రంలో నటించడానికి ఆమిర్‌ అంగీకరించారు. ‘భారీ స్థాయిలో రూపుదిద్దుకొనే యాక్షన్‌ సినిమా ఇది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్‌ మొదలవుతుంది. ఇంతకు మించిన వివరాలు ఇప్పుడు చెప్పలేను’ అని ఓ ఆంగ్ల మీడియాకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్‌ఖాన్‌ వెల్లడించారు. గతంలో తను నటించిన ‘పీకే’ చిత్రానికి సీక్వెల్‌ రాబోతోందన్న వార్తల్లో నిజం లేదనీ, అటువంటి ఆలోచన లేదని ఆమిర్‌ స్పష్టం చేశారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో తను నటించనున్నానని, దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీతో కలసి ఆ సినిమా కోసం పని చేస్తున్నట్లు ఆమిర్‌ చెప్పారు.

Updated Date - Jun 06 , 2025 | 06:39 AM