Sriya Reddy: అమ్మతోడు.. ‘పీఎస్‌’ స్టోరీ అర్థం కాలేదు

ABN , Publish Date - Jan 03 , 2024 | 07:31 PM

మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్‌ సెల్వం’ కథ తనకు అర్థంకాలేదని నటి శ్రియారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ చిత్రంలో ఆమె ఓ ముఖ్య పాత్రను పోషించిన విషయం తెలిసిందే. రాధారమ పాత్రలో ఆమె నటనకు అభినందనలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Sriya Reddy: అమ్మతోడు.. ‘పీఎస్‌’ స్టోరీ అర్థం కాలేదు
Sriya Reddy

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్‌ సెల్వన్’ (Ponniyin selvan) కథ తనకు అర్థంకాలేదని నటి శ్రియారెడ్డి (Sriya Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) నటించిన ‘సలార్‌’ (Salaar) చిత్రంలో ఆమె ఓ ముఖ్య పాత్రను పోషించిన విషయం తెలిసిందే. రాధారమ పాత్రలో ఆమె నటనకు అభినందనలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆమె అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. హిస్టారికల్‌ మూవీస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యేందుకు వీలుగా ఆ చిత్రంలోని కథా పాత్రలను ముందుగానే వెల్లడించం వల్ల కథను సులభంగా అర్థం చేసుకుంటారని ఇటీవల ఓ నిర్మాత వ్యాఖ్యానించారు. దీనిపై శ్రియా రెడ్డి స్పందిస్తూ...

అమ్మతోడు.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కథ నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ సినిమా కథ ఎక్కడ ప్రారంభమై, ఎక్కడకు వెళుతుందో తెలుసుకోలేక గందరగోళానికి గురయ్యానని వ్యాఖ్యానించారు. కాగా ‘పీఎస్‌’ మొదటి, రెండు భాగాలు ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో తమిళ నాట కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో మాత్రం చాలా మంది ఇప్పుడు శ్రియా రెడ్డి ఏదయితే చెప్పిందో.. అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫలితంగా టాలీవుడ్‌లో ఈ చిత్రం ఫ్లాప్ లిస్ట్‌లో చేరింది. కోలీవుడ్‌లో మాత్రం ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.


Vikram.jpg

శ్రియా రెడ్డి విషయానికి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఆమె ‘సలార్’తో ప్రేక్షకులను పలకరించింది. ‘సలార్’తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ (OG) సినిమాలోనూ ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ‘ఓజీ’లో ఆమె చేసే పాత్ర గురించి స్పందిస్తూ.. ఆ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానేమో.. అనేంత గొప్పగా తన పాత్రని సుజీత్ తీర్చిదిద్దాడని చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి:

====================

*Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..

*****************************

*BSS10: బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?

**************************

*HanuMan: ‘హను-మాన్’ ‘శ్రీ రామధూత స్తోత్రం’.. ఇది వేరే లెవల్

****************************

*Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!

****************************

Updated Date - Jan 03 , 2024 | 07:31 PM