HanuMan: ‘హను-మాన్’ ‘శ్రీ రామధూత స్తోత్రం’.. ఇది వేరే లెవల్

ABN , Publish Date - Jan 03 , 2024 | 04:16 PM

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, టీం ‘హనుమాన్’ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమా‌పై ఎక్జయిట్‌మెంట్‌ని పెంచేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ సూపర్బ్ స్పందనను రాబట్టుకుని.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుండి ఫోర్త్ సింగిల్ ‘శ్రీ రామధూత స్తోత్రం’‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట వేరే లెవల్ అన్నట్లుగా అదిరిపోయేలా కంపోజ్ చేశారు.

HanuMan: ‘హను-మాన్’ ‘శ్రీ రామధూత స్తోత్రం’.. ఇది వేరే లెవల్
Hanuman Movie Poster

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, టీం ‘హనుమాన్’ (HanuMan) దూకుడుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమా‌పై ఎక్జయిట్‌మెంట్‌ని పెంచేస్తున్నారు. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ సూపర్బ్ స్పందనను రాబట్టుకుని.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. మేకర్స్ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి మూడు పాటలు విడుదల చేయగా.. అవన్నీ చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. జానర్, కంపోజిషన్ పరంగా దేనికవే ప్రత్యేకమైన పాటలుగా అలరించాయి. బుధవారం ఈ చిత్రం నుండి నాల్గవ సింగిల్-శ్రీరామధూత స్త్రోత్రం‌ (Sri Rama Dootha Stotram)ను విడుదల చేశారు. ఇది వేరే లెవల్ అన్నట్లుగా ఈ లిరికల్ వీడియో దూసుకెళుతోంది.

శ్రీ ఆంజనేయ స్తోత్రం థండర్స్‌తో కూడిన బీట్స్‌కి అనుగుణంగా గౌరహరి అద్భుతంగా కంపోజ్ చేశారు. సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఎడర, హర్షవర్ధన్ చావలి ఎనర్జిటిక్ వాయిస్ పాట థీమ్‌తో ఇంటెన్స్‌ని జోడిస్తుంది. ఈ లిరికల్ వీడియో 3D ప్రజంటేషన్ అమెజింగ్‌గా వుంది. విజువల్స్‌తో చూసినప్పుడు ఇది గూస్‌బంప్స్‌ను కలిగించడం ఖాయం. మొదటి మూడు పాటల మాదిరిగానే శ్రీరామదూత స్త్రోత్రం కూడా మనసులని గెలుచుకోబోతోంది.


Hanu-Man-2.jpg

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న మొట్టమొదటి సినిమా హను-మాన్. సినిమా ముఖ్యంగా ‘అంజనాద్రి’ అనే ఇమాజనరీ ప్లే‌స్‌లో సెట్ చేయబడింది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని 2024, జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ సినిమాగా విడుదల చేయబోతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!

****************************

*Mangai: తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

************************

*Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..

****************************

*SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

************************

Updated Date - Jan 03 , 2024 | 04:16 PM