Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..

ABN , Publish Date - Jan 03 , 2024 | 06:02 PM

లావణ్య త్రిపాఠి లాస్ట్ ఇయర్ మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత ఆమె నటనకు స్వస్తి చెబుతుందా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు కానీ.. పెళ్లికి ముందు ఆమె ఓకే చేసిన ప్రాజెక్ట్స్‌ని మాత్రం పూర్తి చేసే పనిలో ఉంది. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘మిస్ పర్ఫెక్ట్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..
Lavanya Tripathi

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) లాస్ట్ ఇయర్ మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ (Mega Prince Varun Tej) ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత ఆమె నటనకు స్వస్తి చెబుతుందా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు కానీ.. పెళ్లికి ముందు ఆమె ఓకే చేసిన ప్రాజెక్ట్స్‌ని మాత్రం పూర్తి చేసే పనిలో ఉంది. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది. లాస్ట్ ఇయర్ ‘అతిథి, దయా, వధువు’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులని అలరించిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar).. కొత్త ఏడాదిలో ‘మిస్ పర్ఫెక్ట్’ (Miss Perfect) అనే మరో సరికొత్త సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో లావణ్య త్రిపాఠి ఓ కీలక పాత్రలో నటించింది. పెళ్లికి ముందు నటించినా.. పెళ్లి తర్వాత ఈ వెబ్ సిరీస్ విడుదలవుతుండటంతో.. ఇది ఆమెకు ఎంతో కీలకమనే చెప్పుకోవాలి.

‘మిస్ పర్ఫెక్ట్’ విషయానికి వస్తే.. ప్రతి పని పర్ఫెక్ట్‌గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్‌ల గురించి అందరికీ తెలుసు.. కానీ ఇక్కడ మిస్ పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేసింది, చేయించింది అనేది ఈ వెబ్ సిరీస్‌లో హిలేరియస్‌గా చూపించబోతున్నారు దర్శకుడు విశ్వక్ ఖండేరావ్. లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. (Miss Perfect Web Series)


Miss-Perfect.jpg

ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠీ స్పందిస్తూ.. ‘న్యూ ఇయర్‌ను ‘పర్ఫెక్ట్‌’గా మొదలుపెట్టబోతున్నాం...’ అంటూ ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ స్పెషల్స్‌గా త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) మాట్లాడుతూ.. ‘మిస్ పర్ఫెక్ట్’ వంటి ఒక యూనిక్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన జీవితాల్లో అనుకోకుండా ఏర్పర్చుకునే కొన్ని కనెక్షన్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటాయి అనే కథతో.. ఎంటర్‌టైనింగ్ లవ్‌స్టోరీగా ‘మిస్ పర్ఫెక్ట్’ను రూపొందించాం. అన్ని వర్గాల ఆడియెన్స్ ఈ సిరీస్‌తో కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*BSS10: బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?

**************************

*HanuMan: ‘హను-మాన్’ ‘శ్రీ రామధూత స్తోత్రం’.. ఇది వేరే లెవల్

****************************

*Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!

****************************

*Mangai: తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

************************

Updated Date - Jan 03 , 2024 | 06:02 PM