BSS10: బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?

ABN , Publish Date - Jan 03 , 2024 | 04:44 PM

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం చేస్తున్నారు. #BSS10 తాత్కాలిక టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. బుధవారం హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. ఈ చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు.

BSS10: బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?
Bellamkonda Sai Sreenivas in Tyson Naidu

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ప్రస్తుతం సాగర్ కె చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో ఓ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం చేస్తున్నారు. #BSS10 తాత్కాలిక టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టైటిల్‌తో పాటు.. బెల్లంకొండ శ్రీనివాస్‌ను బాక్సింగ్ ఎక్స్‌పర్ట్, లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా పరిచయం చేసే గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు.

బాక్సింగ్ రింగ్‌లో నిలబడి, తనను తాను శక్తివంతుడిగా నిరూపించుకోవడానికి, తాను ఎగురుతూ ఎద్దును కొట్టగలనని గొప్పలు చెప్పుకునే సర్దార్ వాయిస్‌ ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. సర్దార్ మాటతో హీరో పగలబడి నవ్వి యాక్షన్‌లోకి దిగుతాడు. హీరో DSP (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) గా పరిచయం అవుతాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్ టైసన్ మెరుస్తున్న పోస్టర్‌తో అతను బాక్సింగ్ రింగ్‌లోకి ప్రవేశించిన చివరి ఎపిసోడ్ ఆడియన్స్‌కు మాస్ స్టఫ్ అందిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మజల్డ్ బాడీ, గడ్డంతో మాస్‌గా కనిపించి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అలరిస్తున్నారు. యాక్షన్ బ్లాక్ ఇంటెన్స్, ఫేరోషియస్‌గా వున్నాయి. (Tyson Naidu First Glimpse)


Sreenivas.jpg

సాగర్ కె చంద్ర తన హీరోని అద్భుతంగా చూపించడంలో దిట్ట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపించాడు. ముఖేష్ జ్ఞానేష్ తీసిన విజువల్స్, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌.. ఈ గ్లింప్స్‌ను బాగా ఎలివేట్ చేస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడేలా చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*HanuMan: ‘హను-మాన్’ ‘శ్రీ రామధూత స్తోత్రం’.. ఇది వేరే లెవల్

****************************

*Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!

****************************

*Mangai: తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

************************

Updated Date - Jan 03 , 2024 | 04:44 PM