Sreeleela: డ్యాన్స్, ఎనర్జీలో శ్రీలీలకు పోటీనే లేదు.. ఏలేస్తుంది అంతే!

ABN , Publish Date - Jan 13 , 2024 | 05:37 PM

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సంచలన నటి ఎవరయ్యా అంటే.. అందరూ శ్రీలీల పేరే చెబుతారు. ఆమె సినీ జర్నీ అలా ఉంది మరి. ‘పెళ్లిసందD’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఒకేసారి దాదాపు 10 చిత్రాలకు సైన్ చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఛైర్‌కి మరింత దగ్గరైంది.

Sreeleela: డ్యాన్స్, ఎనర్జీలో శ్రీలీలకు పోటీనే లేదు.. ఏలేస్తుంది అంతే!
Sreeleela

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సంచలన నటి ఎవరయ్యా అంటే.. అందరూ శ్రీలీల పేరే చెబుతారు. ఆమె సినీ జర్నీ అలా ఉంది మరి. ‘పెళ్లిసందD’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఒకేసారి దాదాపు 10 చిత్రాలకు సైన్ చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన డ్యాన్సింగ్స్ స్కిల్స్‌తో పాటు, తన నటనాపటిమతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ.. తోటి హీరోయిన్లకు టాప్ కాంపిటేటర్‌గా మారింది.

‘పెళ్లిసందD’ (PelliSandaD), ‘ధమాకా’ (Dhamaka).. ఇటీవల వచ్చిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించడంతో శ్రీలీల (Sreeleela) పేరు మారుమోగుతోంది. ముఖ్యంగా ఆమె డ్యాన్సింగ్ నైపుణ్యం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఈ క్యూట్ బ్యూటీ డ్యాన్స్‌కు ప్రేక్షకులే కాకుండా, స్టార్ హీరోలు సైతం ఫిదా అవుతుండటంతో.. ఇండస్ట్రీ అంతా ఈ రైజింగ్ స్టార్ గురించే మాట్లాడుకుంటోంది. దీంతో శ్రీలీలకు భారీగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నా.. ఏ సినిమాకు ఆమె వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ.. నిర్మాతల శ్రేయస్సు కోరుకుంటున్న ఈ యంగ్ బ్యూటీ, ఇప్పుడు తెలుగు చలనచిత్ర నిర్మాతలందరికీ ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.


Sreeleela-Pic.jpg

తాజాగా శ్రీలీల సినిమాల లిస్ట్‌లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేసిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) కూడా చేరింది. భారీ అంచనాలతో సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా.. మరోసారి శ్రీలీల డ్యాన్సింగ్ టాలెంట్, తనలోని ఎనర్జీని చాటుతోంది. మరీ ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ పాట వచ్చినంత సేపు ఈలలు, చప్పట్లతో థియేటర్లు హోరెత్తిపోతున్నాయంటే.. సినిమా చూసిన వారంతా ఆమె ఎనర్జీ, డ్యాన్సింగ్ టాలెంట్ గురించి మాట్లాడుతున్నారంటే.. శ్రీలీల ఎలా తన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో మ్యాజిక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

తను నటించే ప్రతి సినిమాలోనూ డ్యాన్స్, ఎనర్జీ విషయంలో ఎవరూ తనని బీట్ చేయలేరని మరోసారి శ్రీలీల నిరూపించింది. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ తారగా దూసుకుపోతూ, అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూ.. టాలీవుడ్ క్రష్‌గా మారిన ఈ రైజింగ్ బ్యూటీ.. ముందు ముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)ని ఏ రేంజ్‌లో ఏలేస్తుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి:

====================

*‘హను-మాన్’కు థియేటర్లు ఇవ్వని వారిపై TFPC సీరియస్

***********************

*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది, మహేష్ బాబు స్టామినా!

**************************

*Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ అప్డేట్ కూడా వచ్చేసింది

************************

*‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..

************************

Updated Date - Jan 13 , 2024 | 06:30 PM