Prathinidhi 2: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ ఫ‌స్ట్ సాంగ్ ‘గల్లా యెత్తి’ విడుదల

ABN , Publish Date - Apr 16 , 2024 | 06:54 PM

నారా రోహిత్ హీరోగా తెర‌కెక్కించిన‌ చిత్రం ప్రతినిధి 2. తాజాగా సినిమా నుంచి మొదటి సింగిల్ గల్లా యెత్తి అంటూ సాగే పాట‌ను విడుదల చేశారు.

Prathinidhi 2: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ ఫ‌స్ట్ సాంగ్ ‘గల్లా యెత్తి’ విడుదల
nara roith

నారా రోహిత్ (Rohith Nara) హీరోగా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు (Murthy Journalist) దర్శకుడిగా పరిచయం అవుతూ తెర‌కెక్కించిన‌ చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2). ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. వానరా ఎంటర్టైన్మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ పతాకాలపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ చిత్రం టీజర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచ‌డ‌మే కాక అంచ‌నాల‌ను బాగా పెంచాయి.

nara.jpeg

తాజాగా సినిమా నుంచి మొదటి సింగిల్ గల్లా యెత్తి (Galla Yetthi ) అంటూ సాగే పాట‌ను విడుదల చేశారు. ఈ మాస్ నంబర్‌కు మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) సంగీతం అందించ‌గా కాసర్ల శ్యామ్ ఇచ్చిన‌ సాహిత్యం సమాజంలో మంచి చెడుల గురించి ఆలోచింపజేసే లా ఉంది, రామ్ మిరియాల (Ram miriyala) వాయిస్ మంత్రముగ్ధులను చేసింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీలో నారా రోహిత్ (Rohith Nara) డాన్స్ కూడా చాలా బాగుంది.


prathinidhi.jpeg

గ‌తంలో వ‌చ్చిన‌ ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న ఈ ప్రతినిధి 2 చిత్రంలో నారా రోహిత్ (Rohith Nara) నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో క‌నిపించ‌నుండ‌గా, సిరీ లెల్లా కథానాయికగా నటిస్తోంది, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 08:59 PM