Prathinidhi 2: 10 సంవత్సరాల క్రితం ‘ప్రతినిధి’ విడుదలైన తేదీనే..

ABN , Publish Date - Apr 09 , 2024 | 10:18 PM

హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ చిత్రానికి విడుదల తేదీ ఫిక్సయింది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందం వ్యక్తం చేసిన మేకర్స్, ఉగాది శుభ సందర్భంగా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Prathinidhi 2: 10 సంవత్సరాల క్రితం ‘ప్రతినిధి’ విడుదలైన తేదీనే..
Nara Rohit in Prathinidhi 2

హీరో నారా రోహిత్ (Nara Rohit) ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) చిత్రానికి విడుదల తేదీ ఫిక్సయింది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు (Murthy Devagupthapu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందం వ్యక్తం చేసిన మేకర్స్, ఉగాది (Ugadi) శుభ సందర్భంగా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ‘ప్రతినిధి 2’ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రతినిధి’ సినిమా 10 సంవత్సరాల క్రితం 2014లో ఇదే తేదీన విడుదల కావడం విశేషం. (Prathinidhi 2 Release Date)

*SVC58: వెంకీతో అనిల్ రావిపూడి.. రాబోయే సంక్రాంతికే రిలీజ్


Prathinidhi-2.jpg

విడుదల తేదీ పోస్టర్‌లో రోహిత్ సిల్హౌట్ ఇమేజ్ చూడవచ్చు, ఇక్కడ ప్రజల ఒక వైపు చేతులు ఎత్తడం, మరొక వైపు అల్లర్లు పరిస్థితిని కూడా చూడవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో దినపత్రికలు, కథనాల విభిన్న ముఖ్యాంశాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ మరెంతో దూరంలో లేకపోవడంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ‘ప్రతినిధి 2’ అనేది ‘ప్రతినిధి’ (Prathinidhi) సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిరీ లెల్లా (Siree Lella) కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాని చమిడిశెట్టి డీవోపీగా చేస్తుండగా, యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

Updated Date - Apr 09 , 2024 | 10:18 PM