Nikhil and Pallavi: సీమంతం వేడుకలో.. తల్లిదండ్రులు కాబోతోన్న నిఖిల్ దంపతులు

ABN , Publish Date - Jan 31 , 2024 | 10:11 PM

తన భార్య పల్లవి శ్రీమంతపు వేడుక ఫొటోని షేర్ చేసిన నిఖిల్.. ‘‘సీమంతం .. బేబీ షవర్ యొక్క సాంప్రదాయ భారతీయ రూపం. అతి త్వరలో మేము మా మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. దయచేసి మీ ఆశీస్సులు అందివ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.

Nikhil and Pallavi: సీమంతం వేడుకలో.. తల్లిదండ్రులు కాబోతోన్న నిఖిల్ దంపతులు
Nikhil and Pallavi

యంగ్ హీరోలలో నిఖిల్ దారే వేరు. విభిన్నమైన సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేక స్టార్‌డమ్ సొంతం చేసుకున్న హీరో నిఖిల్. ‘కార్తికేయ 2’ సినిమాతో ఆయన పాన్ ఇండియా హీరోగా మారారు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ అనే మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో కత్తులు, యుద్ధాలు, గుర్రపు స్వారీ.. ఇలాంటి వన్నీ ఉంటాయనేలా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఆయన మరో రెండు మూడు సినిమాలు కమిటై ఉన్నారు. సినిమాల సంగతి అలా ఉంటే.. నిఖిల్ అతి త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆ విషయం స్వయంగా ఆయనే ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

తన భార్య పల్లవి సీమంతపు వేడుక ఫొటోని షేర్ చేసిన నిఖిల్.. ‘‘సీమంతం .. బేబీ షవర్ యొక్క సాంప్రదాయ భారతీయ రూపం. అతి త్వరలో మేము మా మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. దయచేసి మీ ఆశీస్సులు అందివ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు. నిఖిల్ చేసిన ఈ పోస్ట్‌కి నెటిజన్లు, అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


Nikhil.jpg

కాగా కరోనా టైమ్‌లో 2020లో కరోనా ఆంక్షల మధ్య పల్లవిని నిఖిల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వృత్తి రీత్యా డాక్టర్ అయిన పల్లవిని నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగు సంవత్సరాల తర్వాత.. వారు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో ఇరు ఫ్యామిలీ మెంబర్స్ ఆనందంలో ఉన్నారు. ఇక నిఖిల్ అభిమానుల ఆనందానికి అయితే అవధులే లేవంటే నమ్మాలి. ఆ విషయం నిఖిల్ చేసిన ఈ పోస్ట్‌కి వస్తున్న కామెంట్స్ చూస్తే తెలుస్తుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Nandi Awards: నంది అవార్డ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

***************************

*Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..

******************************

*Dheera: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి హిట్టవుతుంది

****************************

*Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?

**************************

Updated Date - Feb 10 , 2024 | 10:23 PM