Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?

ABN , Publish Date - Jan 31 , 2024 | 03:09 PM

సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ‘సైంధవ్’ చిత్రం 4 వారాల లిమిట్ అనే రూల్‌ని క్రాస్ చేసి ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. అందుకు కారణాలు అనేకం. అందుకే మేకర్స్ ‘సైంధవ్’ని ఓటీటీలోకి ఎర్లీగా తీసుకొచ్చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌కి వస్తుందంటే..

Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?
Saindhav Movie Still

సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ‘సైంధవ్’ (Saindhav) చిత్రం 4 వారాల లిమిట్ అనే రూల్‌ని క్రాస్ చేసి ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. అందుకు కారణాలు అనేకం. అందుకే మేకర్స్ ‘సైంధవ్’ని ఓటీటీలోకి ఎర్లీగా తీసుకొచ్చేస్తున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా, ఇప్పటి వరకు వినబడినట్లుగా ‘సైంధవ్’ ఫిబ్రవరి 2వ తేదీన ఓటీటీలోకి రావడం లేదు. ఫిబ్రవరి 2వ తేదీన సైంధవ్ ఓటీటీలోకి అంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ అధికారికంగా ‘సైంధవ్’ స్ట్రీమింగ్‌ని ప్రకటించారు. (Saindhav OTT Streaming Date)

అధికారికంగా వచ్చిన విడుదల తేదీ ప్రకారం ముందు నుండి జరుగుతున్న ప్రచార తేదీన కాకుండా.. ఫిబ్రవరి 3న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 3వ తేదీ నుండి వెంకీ ‘సైంధవ్’ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందని.. సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులని మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం కచ్చితంగా ఆదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు. చూద్దాం మరి.. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో.


Venkatesh.jpg

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) 75వ చిత్రంగా శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ కథ అంతా చంద్రప్రస్థ అనే ఒక సిటీలో జరుగుతుంది. సైంధవ్ కోనేరు లేదా సైకో (వెంకటేష్) చంద్రప్రస్థ పోర్టులో ఉద్యోగి. అతను తన పాప గాయత్రి (సారా పాలేకర్)తో ఉంటాడు, స్నేహితురాలు మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) పక్కింట్లో ఉంటుంది, ఆమె ఒక క్యాబ్ డ్రైవర్. మనోజ్ఞ, తన భర్త (గెటప్ శ్రీను) మీద గృహ హింస కేసు పెట్టి వెంకటేష్ ఇంటి పక్కన ఉంటుంది, ఆమెకి సైంధవ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే అతని బిడ్డను తన కూతురిలా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు స్కూల్లో గాయత్రి ఉన్నట్టుండి కింద పడిపోతుంది, ఆసుపత్రికి తీసుకెళితే ఆమెకి ఎస్ఎంఏ (నాడీ కండరాల వ్యాధి) ఉందని, పాప బతకడానికి రూ.17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ అవసరం అని డాక్టర్లు చెబుతారు. మిత్రా (ముఖేష్ రుషి), వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), మైఖేల్ (జిష్షు సేన్ గుప్తా) తదితరులు భాగస్వామిగా ఉన్న ఒక కార్టల్ టీము అక్రమంగా కొన్ని రవాణా వ్యాపారాలు చేస్తూ, అందులో కొంతమంది పిల్లల్ని కూడా అక్రమంగా తరలిస్తుంటారు. ఈ మాఫియా గ్యాంగ్‌కి సైకో అంటే భయం. ఎందుకు వీళ్ళకి సైకో అంటే భయం? అతని నేపధ్యం ఏంటి? పాప బతకడానికి ఆ మందు కొనడానికి సైకో రూ.17 కోట్లు ఎలా తెచ్చాడు, చివరికి పాపని బతికించుకున్నాడా? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే ‘సైంధవ్’. (Saindhav Story)


ఇవి కూడా చదవండి:

====================

*ఇళయరాజాను పరామర్శించిన మోహన్ బాబు

***********************

*పద్మశ్రీ గ్రహీతలను సత్కరించిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి

*****************************

*Pushpa2: అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ ఫొటో లీక్.. సుకుమార్ ఫైర్

***********************

*Santhanam: నొప్పించడానికి కాదు.. నవ్వించేందుకే సినిమాల్లోకి వచ్చా

************************

Updated Date - Jan 31 , 2024 | 03:09 PM