Dheera: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి హిట్టవుతుంది

ABN , Publish Date - Jan 31 , 2024 | 05:00 PM

లక్ష్ నటించిన ధీర ట్రైలర్ బాగుంది. మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ఫిబ్రవరి 2న రాబోతోంది. లక్ష్ కష్టానికి, టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి. ప్రేక్షకులు ఈ సినిమాను విజయవంతం చేయాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు నిర్మాత దిల్ రాజు. ‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాల తరువాత హీరో లక్ష్ చేసిన ‘ధీర’ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Dheera: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి హిట్టవుతుంది
Dheera Movie Pre Release Event Group Photo

‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ (Laksh Chadalavada) మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అయ్యారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌‌పై పద్మావతి చదలవాడ నిర్మించిన చిత్రం ‘ధీర’. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.

అనంతరం ఈ చిత్ర నైజాం, వైజాగ్ హక్కుల్ని తీసుకున్న నిర్మాత దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. 25 ఏళ్ల నుండి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తూనే ఉన్నాం. అనురాధ ప్రొడక్షన్స్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. ఆ టైంలోనే నేను డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించాను. వారితో నాకు పెద్దగా పరిచయం ఉండేది కాదు. దసరా సినిమాను వాళ్లు కొన్నారని తెలిసి వారిని కలవడం జరిగింది. ఆ తరువాత మేం వ్యక్తిగతంగా ఎంతో దగ్గరయ్యాం. శ్రీనివాస్ గారు ఎంతో మంది చిన్న నిర్మాతలకు సాయం చేశారు. ఫైనాన్షియల్‌గా ఎంతో సపోర్ట్ చేస్తారు. ఫిలిం చాంబర్ ఎలక్షన్స్‌లోనూ నేను అధ్యక్షుడిగా ఉండాలని నా కోసం ఎంతో సాయం చేశారు. నాకు మిగిలిన ఈ టైంలో, ఆ పదవి నుంచి వెళ్లే లోపు రిజల్ట్‌ను చూపించే ప్రయత్నం చేస్తాను. లక్ష్ నటించిన ధీర ట్రైలర్ బాగుంది. మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ఫిబ్రవరి 2న రాబోతోంది. లక్ష్ కష్టానికి, టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి. ప్రేక్షకులు ఈ సినిమాను విజయవంతం చేయాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.


Dheera-2.jpg

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేను ఇన్నేళ్లలో ఏ హీరోని కూడా డేట్స్ అడగలేదు. ఎంతో మంది దర్శకులని నేను పరిచయం చేశాను. ధీర సినిమాతో డైరెక్టర్ విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. దర్శకుడు పడ్డ కష్టాన్ని నేను చూశాను. ఆయన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. తండ్రిగా నేను లక్ష్‌ను చూసి గర్విస్తుంటాను. ఇంతకు మించిన ఆనందం నాకు ఇక రాదు. ఫిబ్రవరి 2న ధీర చిత్రం రాబోతోంది. మార్చిలో నేను వంద కోట్లతో తీసిన ‘రికార్డ్ బ్రేక్’ అనే గ్రాఫిక్స్ చిత్రం రాబోతోంది. నేనే ఆ సినిమాను ఐదేళ్ల నుంచి తీస్తున్నా. అది పాన్ వరల్డ్ సినిమా. మా ప్రొడక్షన్స్‌లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఇంకా మంచి మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. (Dheera Pre Release Event)

హీరో లక్ష్ చదలవాడ మాట్లాడుతూ.. సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేం. నా పాత్ర గురించి మాట్లాడతాను. సినిమాలోని పాత్ర, రియల్ లైఫ్‌లోని నా కారెక్టర్‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు. పక్కనోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేస్తుంటాడు. అలాంటి వాడికి ఓ మిషన్ ఇస్తే.. ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యలు ధీరలో చూపించబోతున్నాం. నా లుక్ బాగుంది. ఫిబ్రవరి 2న మా సినిమా రాబోతోంది. మేం ఎంత చేసినా ఆడియెన్స్‌కు నచ్చకపోతే వృధా. మీకు సినిమా నచ్చితే.. ఇంకా కష్టపడి సినిమాలు చేస్తాం. మేం నిజాయితీగా ఈ సినిమాను తీశాం. ఎస్‌టీటీవి ఫిల్మ్స్‌లో ఎప్పుడూ కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. మా సినిమాతో పాటు వస్తున్న అనిల్ ‘హ్యాపీ ఎండింగ్’, ధీరజ్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, సోహెల్ ‘బూట్ కట్ బాలరాజు’ ఇలా అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటేనే మేం అంతా బాగుంటామని అన్నారు. డైరెక్టర్ విక్రాంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దర్శకుడు రాసుకున్న కథ, కన్న కలలను నిర్మాత నెరవేరుస్తుంటారు. ఇంత పెద్ద బ్యానర్‌ నుంచి దర్శకుడిగా పరిచయం అవుతానని అనుకోలేదు. ఘోస్ట్‌గా రాసిన సినిమాలు హిట్టయ్యాయి. కానీ పేరు రాలేదు. ఆ తరువాత ‘ధీర’ కథను రాసుకున్నాను. రాముడికి, కృష్ణుడికి కొన్ని లక్షణాలుంటాయి. రావణాసురుడికి కొన్ని లక్షణాలుంటాయి. ధీర సినిమాలోని హీరో పాత్ర కూడా గ్రే షేడ్స్‌లోనే ఉంటుంది. ఇది చాలా యూనిక్ పాయింట్. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ కథను రాసుకున్నాను. ఫస్ట్ సినిమానే తేడా కొడితే దర్శకుడి జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. లక్ష్ నాకు ప్రతీ విషయంలో సపోర్ట్‌గా నిలిచారు. కెమెరా వర్క్, మ్యూజిక్ అంతా బాగా వచ్చింది. ఈ చిత్రం 80 శాతం నైట్ ఎఫెక్ట్‌లో ఉంటుంది. ఫిబ్రవరి 2న రాబోతోన్న అన్ని చిత్రాలు హిట్ అవ్వాలి. సినిమా పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. సినిమా ఘన విజయం సాధించి, యూనిట్‌కు మంచి పేరు రావాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

====================

*Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?

**************************

*ఇళయరాజాను పరామర్శించిన మోహన్ బాబు

***********************

*పద్మశ్రీ గ్రహీతలను సత్కరించిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి

*****************************

*Pushpa2: అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ ఫొటో లీక్.. సుకుమార్ ఫైర్

***********************

Updated Date - Jan 31 , 2024 | 05:00 PM