Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..

ABN , Publish Date - Jan 31 , 2024 | 06:23 PM

ఆ హీరోతో అలాంటి అవకాశం రానందుకు చాలా బాధపడ్డానంటూ రైజింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరుస సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ తన అభిమానులకు అందుబాటులో ఉంటారనే విషయం తెలియంది కాదు. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..
Mrunal Thakur

ఆ హీరోతో అలాంటి అవకాశం రానందుకు చాలా బాధపడ్డానంటూ రైజింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఆవేదన వ్యక్తం చేశారు. వరుస సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ తన అభిమానులకు అందుబాటులో ఉంటారనే విషయం తెలియంది కాదు. అలాగే సినిమాల్లో ఎంత క్యూట్‌గా కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం కావాల్సినంత ట్రీట్ ఇస్తుంటారు. అలాంటి మృణాల్ బాధపడ్డానని చెబితే.. అభిమానులు తట్టుకుంటారా? అందుకే ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఏ హీరోతో, ఎలాంటి అవకాశం? అని అనుకుంటున్నారా. విషయంలోకి వస్తే

తాజాగా మృణాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమెకు డ్యాన్స్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ.. ఇప్పటి వరకు నేను కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటించా. అందువల్ల నాలోని డ్యాన్సింగ్ టాలెంట్ చూపించే అవకాశం రాలేదు. బాలీవుడ్‌లో డ్యాన్స్ అనగానే హృతిక్ రోషన్ (Hrithik Roshan) పేరు వినబడుతుంది. అలాంటిది ఆయన చిత్రంలో నటించి కూడా నాకు ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. అందుకు ఎంతో బాధపడ్డాను. అలాగే షాహిద్ కపూర్‌ (Shahid Kapoor)తో జెర్సీలో నటించా.. అందులోనూ డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. సీరియస్ రోల్ అది. ఇలా నేను నటించిన వారంతా మంచి డ్యాన్సర్సే కానీ నాకే వారితో డ్యాన్స్ చేసే స్కోప్ ఉన్న సినిమా పడలేదు. ఇప్పుడొక చిత్రం చేస్తున్నా.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో. ఆ సినిమాతో నా డ్యాన్స్ డ్రీమ్ తీరుతుందని మృణాల్ చెప్పుకొచ్చింది.


Mrunal.jpg

డ్యాన్స్ గురించే కాదు.. బాలీవుడ్‌ (Bollywood)లో రొమాంటిక్ పాత్రలు (Romantic Roles) కూడా తనకి రావడం లేదని మృణాల్ ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్‌లో లవ్ స్టోరీస్‌లో నటించాలని కోరుకుంటున్నాను కానీ.. ఎందుకో నాకు ఆ అవకాశం రావడం లేదు. ఎప్పటి నుండో ఆ పాత్రల కోసం వేచి చూస్తున్నాను కానీ బాలీవుడ్ మేకర్స్‌కి నన్ను అలా చూడటం ఇష్టం లేదనుకుంటా. ఎవరూ నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదని పేర్కొంది. ఆమె ఆవేదన విన్న అభిమానులు.. బాధపడొద్దు.. త్వరలోనే మిమ్మల్ని మీరు కోరుకుంటున్న అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని, మీకు ఆ టాలెంట్ ఉందనేలా ప్రోత్సహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Dheera: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి హిట్టవుతుంది

****************************

*Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?

**************************

*ఇళయరాజాను పరామర్శించిన మోహన్ బాబు

***********************

*పద్మశ్రీ గ్రహీతలను సత్కరించిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి

*****************************

Updated Date - Jan 31 , 2024 | 06:28 PM