Anjali: బాలయ్య నెట్టడంపై రియాక్టైన అంజలి.. ఇక ఫుల్‌స్టాప్‌ పడినట్టేనా?

ABN , Publish Date - May 31 , 2024 | 11:58 AM

విశ్వక్ సేన్, నాగ వంశీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ క్లారిటీ ఇస్తే, ఇప్పుడు అంజలి కూడా ట్విట్టర్ వేదికగా బాలయ్యతో తన స్నేహబంధం ఇదని చెబుతూ ఓ ట్వీట్ చేసింది. అంతకుముందు అంజలిని స్టేజ్‌పై బాలయ్య నెడుతున్న వీడియో ఒకటి బాగా ట్రెండ్ అవుతోన్న విషయం తెలిసిందే.

Anjali: బాలయ్య నెట్టడంపై రియాక్టైన అంజలి.. ఇక ఫుల్‌స్టాప్‌ పడినట్టేనా?
Balakrishna and Anjali

ఏ ముహూర్తాన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ వేడుకకు వస్తానని మాటిచ్చాడో తెలియదు కానీ.. ఆ ఈవెంట్‌కు సంబంధించి సినిమా కంటే కూడా బాలయ్య (Balayya) పేరు బాగా వైరల్ అవుతోంది. ఈ వేడుకలో బాలయ్యపై కొందరు చేసిన గ్రాఫిక్స్ వీడియోలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అవి గ్రాఫిక్స్ చేశారని చిత్ర నిర్మాత, హీరో వివరణ ఇచ్చారంటే.. ఏ రేంజ్‌లో ఆ వీడియోలు హాట్ టాపిక్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. సరే.. ఈ విషయం ఇలా ఉంటే, ఇప్పుడు మరో వీడియో కూడా బాలయ్యని వార్తలలో హైలెట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా స్త్రీలకు బాలయ్య ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ కొన్ని నేషనల్ మీడియాలు సైతం వార్తలను కవర్ చేస్తుండటం విశేషం. అయితే అసలు విషయం తెలుసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాస్తున్న, వీడియోలను వైరల్ చేస్తున్న వారికి చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తూ వస్తుంది. (Gangs Of Godavari Pre Release Event)

*Super Star Krishna: నా ప్రతి జ్ఞాపకంలోనూ జీవించే ఉంటారు.. మహేష్ ట్వీట్ వైరల్

విశ్వక్ సేన్ (Vishwak Sen), నాగ వంశీ (Naga Vamsi).. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ క్లారిటీ ఇస్తే, ఇప్పుడు అంజలి (Anjali) కూడా ట్విట్టర్ వేదికగా బాలయ్యతో తన స్నేహబంధం ఇదని చెబుతూ ఓ ట్వీట్ చేసింది. అంతకుముందు అంజలిని స్టేజ్‌పై బాలయ్య నెడుతున్న వీడియో ఒకటి బాగా ట్రెండ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ వీడియోని సగం, సగం కట్ చేసి కొందరు కావాలని షేర్ చేస్తూ.. బాలయ్య ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే.. తనకు లేని ప్రాబ్లమ్.. ఆ వీడియోని వైరల్ చేస్తున్న వారికేంటనేలా అంజలి ఇచ్చిపడేసింది.


Gog.jpg

‘‘మా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన బాలకృష్ణ (Nandamuri Balakrishna)గారికి ధన్యవాదాలు. ఆయనకు, నాకు ఒకరి పట్ల మరొకరికి ఎంతో గౌరవం ఉంది. చాలా కాలం నుంచి మా మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. ఆయనతో ఇలా మరోసారి వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉంది’’ అని చెబుతూ.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకలోని కొన్ని మెమరబుల్ మూమెంట్స్‌తో ఉన్న వీడియోని అంజలి షేర్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

అంజలి చేసిన ఈ ట్వీట్‌తో అందరికీ జ్ఞానోదయం అయి ఉంటుందనేలా నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదయితేనేం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియోకు, ఆ వీడియోలో కట్ చేసిన కంటెంట్‌కు ఇలా ఫుల్‌స్టాప్ పెట్టేసిందనేలా.. అంజలి పోస్ట్‌పై (Anjali Post on Incident at Gangs Of Godavari Event) నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇక అంజలి నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నేడు (మే 31) గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై.. మంచి స్పందనను రాబట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Read Latest Cinema News

Updated Date - May 31 , 2024 | 11:58 AM