scorecardresearch

Balakrishna: నవ్వుతూ నన్ను పడేసింది.

ABN , First Publish Date - 2022-12-22T14:29:41+05:30 IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ షో ‘అన్‌స్ట్టాపబుల్‌ -2’ దూసుకెళ్తుంది. అతిథులుగా హాజరైన సెలబ్రిటీలను బాలయ్య తనదైన శైలి ప్రశ్నలతో అలరిస్తున్నారు. తాజాగా ఈ షోలో అలనాటి తారలు జయప్రద, జయసుధ, ఈతరం నటి రాశీఖన్నా పాల్గొని సందడి చేశారు.

Balakrishna: నవ్వుతూ నన్ను పడేసింది.

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ షో ‘అన్‌స్ట్టాపబుల్‌ -2’ (unstoppable 2)దూసుకెళ్తుంది. అతిథులుగా హాజరైన సెలబ్రిటీలను బాలయ్య తనదైన శైలి ప్రశ్నలతో అలరిస్తున్నారు. తాజాగా ఈ షోలో అలనాటి తారలు జయప్రద,(Jayaprada) జయసుధ(Jayasudha), ఈతరం నటి రాశీఖన్నా (Raashi khanna) పాల్గొని సందడి చేశారు. బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసి కెరీర్‌, సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాశీఖన్నాతో కలిసి డాన్స్‌ చేయడంతో ‘ఇదేదో తేడాగా ఉందే’ అంటూ జయప్రద ఆటపట్టించారు. దానికి బాలకృష్ణ రాశీఖన్నా నవ్వుతూ నన్ను పడేసింది. నేను ఆమెకు పడిపోయాను కూడా! రాశీఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ నుంచి ‘ఏం సందేహం లేదు’ పాట పాడి సందడి చేశారు. ‘‘హీరోయిన్‌ కావాలంటే కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. ఇది నిజమా? కాదా?’, విమెన్‌ సెంట్రిక్‌ చిత్రాలపై డబ్బు పెట్టాలంటే నిర్మాతలు వందసార్లు ఆలోచిస్తారు.. ఇది నిజమా కాదా? అన్న ప్రశ్నలకు ఈ ముగ్గురు తారలు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే తాజా ఎపిసోడ్‌ చూడాల్సిందే!

అంతే కాదు బాలయ్య తనదైన శైలి మాటలతో నవ్వులు పూయించారు. ప్రస్తుతం నేనూ, శ్రుతీహాసన్‌ హాట్‌ టాపిక్‌ ఆఫ్‌ ది ఆంధ్రప్రదేశ్‌’ అని చెప్పుకొచ్చారు. దానికి జయసుధ, జయప్రద ఆశ్చర్యంగా చూశారు. ప్రస్తుతం ప్రోమో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Updated Date - 2022-12-22T14:31:38+05:30 IST