MAA: మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:02 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణు ఎన్నికయ్యారు. ఈసారి మంచు విష్ణుని ‘మా’ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మంచు విష్ణు పదవీకాలం పూర్తయ్యి చాలా కాలం అవుతుంది. అయినా కూడా విష్ణునే ఇన్నాళ్లు అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు. ‘మా’కు ఎప్పుడో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పుడు 26 మంది కమిటీ సభ్యులు ఎలక్షన్స్ లేకుండానే మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

MAA: మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు
MAA Members

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మరోసారి మంచు విష్ణు (Manchu Vishnu) ఎన్నికయ్యారు. ఈసారి మంచు విష్ణుని ‘మా’ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మంచు విష్ణు పదవీకాలం పూర్తయ్యి చాలా కాలం అవుతుంది. అయినా కూడా విష్ణునే ఇన్నాళ్లు అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు. ‘మా’కు ఎప్పుడో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పుడు 26 మంది కమిటీ సభ్యులు మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకుని.. ఎలక్షన్స్ లేకుండానే, ఎటువంటి రచ్చ జరగకుండానే కామ్‌గా క్లోజ్ చేశారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ‘మా’ ఎన్నిక జరగాల్సి ఉంది. (MAA Elections)

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..


రచ్చ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఇంతకు ముందు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ (Prakash Raj) పోటీ పడగా.. టాలీవుడ్‌లో దాదాపు సార్వత్రిక ఎన్నికలను తలపించినంత రణరంగం జరిగింది. దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఈ ఎన్నికల గురించి డిస్కషన్ జరిగిందంటే.. ఏ రేంజ్‌లో ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం.. అలాంటి రచ్చకు తావీయకుండా.. మంచు విష్ణుకే (Maa President Vishnu Manchu) మరోసారి పగ్గాలు అప్పజెప్పారు.


Manchu-Vishnu.jpg

మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికవగా.. రఘు బాబు (Raghu Babu) జెనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి (Karate Kalyani) జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ (Siva Balaji) ట్రెజరర్‌గా .. మధుమిత, శైలజ, జయవాణి వంటి వారు ఈసీ మెంబర్స్‌గా ఎన్నుకోబడ్డారు. ఈ ఏకగ్రీవ తీర్మానంలో.. విష్ణు పనితీరును మెచ్చుకున్న లైఫ్ మెంబెర్స్.. ‘మా’కు నూతన భవనం నిర్మించే వరకు మంచు విష్ణుయే అధ్యక్షుడిగా ఉంటారంటూ ప్రకటించడం విశేషం.


ఇవి కూడా చదవండి:

====================

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

Updated Date - Apr 07 , 2024 | 10:09 PM