Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:11 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా శుక్రవారం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారని.. రిలీజైన ప్రతి థియేటర్‌లో హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోందని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ఆఫీస్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది.

Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..
Dil Raju, Mrunal Thakur and Parasuram Petla

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా శుక్రవారం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారని.. రిలీజైన ప్రతి థియేటర్‌లో హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోందని చిత్రయూనిట్ తెలుపుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ఆఫీస్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహిళా ప్రేక్షకులు పాల్గొని ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా టీమ్ మెంబర్స్‌ను సత్కరించారు.

ఈ సక్సెస్ మీట్‌లో నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) మాట్లాడుతూ.. గురువారం మీడియా మిత్రుల కుటుంబాలతో కలిసి మా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించాం. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశాం. ఉదయం నాలుగు గంటల నుంచే యూఎస్ నుంచి మెసేజెస్ రావడం మొదలైంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా థియేటర్స్‌కు వెళ్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో మార్నింగ్ ఏడున్నరకు షోస్ మొదలయ్యాయి. నేను కూకట్‌పల్లి భ్రమరాంభ థియేటర్‌లో సినిమా చూశాను. 90 పర్సెంట్ యూత్ ఆడియెన్స్ థియేటర్‌లో ఉన్నారు. నేను ఏ ఏ సన్నివేశాల్లో ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతారు అనుకున్నానో అదే జరిగింది. సినిమా మొదలైన పది నిమిషాల వరకు ప్రేక్షకులు సైలెంట్‌గా ఉన్నారు. మృణాల్ ఎంట్రీ నుంచి రెస్పాన్స్ మొదలైంది. మరికాసేపటికి సినిమాలో వాళ్లంతా ఇన్వాల్వ్ అయి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. యూఎస్ నుంచి వచ్చిన రిపోర్ట్‌లో ఫస్టాఫ్ సూపర్బ్‌గా ఉంది. సెకండాఫ్ కొంతసేపు స్లోగా ఉంది, ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ చాలా బాగుందని చెప్పారు. (Dil Raju Reaction on Family Star Result)

*The Family Star Movie Review: విజయ్ దేవరకొండకి 'ది ఫ్యామిలీ స్టార్' బ్రేక్ ఇచ్చిందా...


కానీ హైదరాబాద్‌లో నేను చూస్తున్నప్పుడు సినిమా మొత్తం ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సెకండాఫ్‌లో విజయ్, మృణాల్ కాంబో సీన్స్ కూడా వారికి బాగా నచ్చాయి. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్‌గా థియేటర్స్‌కు వెళ్తున్నారు. మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయి. సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. వాళ్లలో 90 పర్సెంట్ మందికి ఫ్యామిలీ స్టార్ బాగా నచ్చింది. అందుకే సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ మా టీమ్‌కు సత్కారం చేస్తామంటే సంతోషంగా ఒప్పుకుని రమ్మని చెప్పాం. మేము ఇచ్చే స్టేట్‌మెంట్స్‌ను మీడియా ఎలా యాక్సెప్ట్ చేస్తుందో.. వాళ్లు రివ్యూస్‌లో ఇచ్చే స్టేట్‌మెంట్స్‌ను మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. మీడియా షో చూశాక నాతో టచ్‌లో ఉండే మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఫ్యామిలీతో ‘ఫ్యామిలీ స్టార్’ చూసి ఎంజాయ్ చేశామని చెప్పారు. (The Family Star)


Vijay-deverakonda.jpg

మేము సినిమాలో బామ్మకు, మనవడికి మధ్య చూపించిన ఎమోషన్.. బాబాయ్, పిల్లలు, అన్నదమ్ముల మధ్య చూపించిన ఎమోషన్.. ఆడియెన్స్‌కు బాగా నచ్చుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ (Family Audience) ఈ సినిమా చూడండి. మాకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో మీరూ అలాగే ఫీలవుతారు. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ స్టార్‌ను ఎంజాయ్ చేయండి. సినిమా చూశాక మీకు నచ్చితే మరో నలుగురికి చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే తమ ఫ్యామిలీని గొప్ప పొజిషన్ లోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్ ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి శనివారం నుంచి వారిని కలవబోతున్నాం. ఇప్పటికే ఇలాంటి మూడు ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేశాం. పర్సనల్‌గా నేను, విజయ్, పరశురామ్, మృణాల్ వెళ్లి ఆ ఫ్యామిలీ స్టార్‌ను సర్ ప్రైజ్ చేయబోతున్నాం’’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

*Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..

************************

*Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్‌

*******************************

Updated Date - Apr 05 , 2024 | 10:11 PM