Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

ABN , Publish Date - Apr 07 , 2024 | 08:23 PM

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘భారతీయుడు 2’ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేసింది. ఇప్పుడు మరో తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా అప్డేట్‌ని లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో ‘జై భీమ్’ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రాబోతోన్న ‘వేట్టయాన్’ రిలీజ్ వివరాలను మేకర్స్ ప్రకటించారు.

Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..
Super Star Rajinikanth in Vettaiyan

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Ulaganayagan Kamal Haasan), గ్రేట్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘భారతీయుడు 2’ (Bharateeyudu2) సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) సంస్థ విడుదల చేసింది. ఇప్పుడు మరో తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) నటించిన సినిమా అప్డేట్‌ని లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో ‘జై భీమ్’ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ (TJ Gnanavel) దర్శకత్వంలో ‘వేట్టయాన్’ (Vettaiyan) అనే సినిమా రాబోతోంది. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ (Subaskaran) భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

*Bharateeyudu2: అఫీషియల్.. డేట్ చెప్పలేదు కానీ.. ‘భారతీయుడు 2’ విడుదల ఎప్పుడో చెప్పారు


Vettaiyan.jpg

ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. తాజాగా ‘వేట్టయాన్’ (Vettaiyan Movie) మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో రజినీ స్టైల్, ఆ నవ్వు, ఆ గన్ను పట్టిన విధానం, ఆ హెయిర్ స్టైల్ అన్నీ కూడా అభిమానులను మెప్పించేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించడంతో దసరా పోటీ రసవత్తరంగా మారేట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. (Vettaiyan Release Update)


ఇవి కూడా చదవండి:

====================

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

Updated Date - Apr 07 , 2024 | 08:23 PM