Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

ABN , Publish Date - Apr 05 , 2024 | 09:21 PM

ఇటీవ‌లే ‘గాడ్సే’ సినిమాతో వచ్చి ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచిన స‌త్య‌దేవ్.. ఈసారి మాస్ బొమ్మ ‘కృష్ణ‌మ్మ‌’తో భారీ విజ‌యం సాధించాల‌ని క‌సి మీద ఉన్నారు. ‘కృష్ణ‌మ్మ‌’తో మొద‌టిసారి పూర్తి స్థాయి యాక్ష‌న్ క‌థ‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ సినిమాకు వి.వి గోపాలకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌తో పాటు మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. మే 3 గ్రాండ్ లెవల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..
Sathya Dev in Krishnamma

పక్కా కమర్షియల్‌ సినిమా అయినా, ప్రయోగాత్మక సినిమా అయినా.. నటనకు ప్రాధాన్యముందంటే, ఆటోమేటిగ్గా అందరి చూపులూ హీరో సత్యదేవ్‌ (Sathya Dev) వైపు చూడాల్సిందే. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్న హీరో సత్యదేవ్‌. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’ (Krishnamma). రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 3 గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Krishnamma Movie Release Date)

*Seetha Kalyana Vaibhogame: ‘సీతా కళ్యాణ వైభోగమే’ ఫస్ట్ లుక్ ఇదే..


ఈ సందర్భంగా నిర్మాత కృష్ణ కొమ్మలపాటి (Krishna Kommalapati) మాట్లాడుతూ.. ‘‘రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు టైటిల్‌ ‘కృష్ణమ్మ’ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సత్యదేవ్‌ కచ్చితంగా ఈ సినిమాతో మరో రేంజ్‌కి చేరుకుంటారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి, పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. కాలభైరవ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వేసవి కానుకగా మే 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.


Krishnamma.jpg

దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ (VV Gopala Krishna) మాట్లాడుతూ.. స్నేహానికి ఉన్న విలువను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. టైటిల్‌ సాంగ్‌లోనే హీరోకి, అతని స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాం. ఇంటెన్స్ థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సమ్మర్‌కి ఓ బెస్ట్ సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు తప్పక కలుగుతుందని చెప్పారు. సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించిన ఈ సినిమాలో లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Simhadri-Sathya-Dev.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..

************************

*Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్‌

*******************************

*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు

******************************

Updated Date - Apr 05 , 2024 | 09:21 PM