Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

ABN , Publish Date - Apr 07 , 2024 | 06:25 PM

బాలీవుడ్‌లో నటిగా చేస్తూ.. అప్పుడప్పుడు టాలీవుడ్‌లో మెరుస్తోన్న హీరోయిన్ సన్నీ లియోన్. టాలీవుడ్ అనే కాదు.. ఇతర భాషల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ నటిగా గుర్తింపును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!
Sunny Leone

బాలీవుడ్‌లో నటిగా చేస్తూ.. అప్పుడప్పుడు టాలీవుడ్‌లో మెరుస్తోన్న హీరోయిన్ సన్నీ లియోన్ (Sunny Leone). టాలీవుడ్ అనే కాదు.. ఇతర భాషల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ నటిగా గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, తన పాత జీవితం సంగతి పక్కన పెడితే.. ఈ మధ్య కాలంలో ఆమె లైఫ్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ముఖ్యంగా పిల్లల విషయంలో సన్నీ లియోన్ దంపతులు చూపించే ప్రేమపై ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. ఎందుకంటే, వారు నిషా అనే ఓ పాపని దత్తత తీసుకుని సొంత బిడ్డ కంటే ఎక్కువగా ఆమెపై ప్రేమను కురిపిస్తున్నట్లుగా ఎన్నో వీడియోలు బయటికి వచ్చాయి. ఆ తర్వాత సరొగసీ (Surrogacy) విధానంతో ఇద్దరు కవల బాబులకు వారు జన్మనిచ్చారు. ముగ్గురు పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ.. వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే.. తాజాగా సన్నీ లియోన్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

*Rashmika Mandanna: సినిమాకే హైలెట్‌ సీన్  అది.. దాన్ని కూడా...!


ప్రస్తుతం సన్నీ లియోన్ వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా అరంగేట్రం చేసింది. ఎంటీవీలో ప్రసారమవుతోన్న స్ల్పిట్స్ విల్లా (Splitsvilla) ఐదో సీజన్ హోస్ట్‌గా ఆమె వ్యవహరిస్తోంది. ఈ షోలో ఆమె తన జీవితంలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన గురించి చెబుతూ.. ఎమోషనల్ అయ్యింది. పైకి ఎంతో అందంగా, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సన్నీ లియోన్ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయంటే అంతా ఆశ్చర్యపోతారు. అలాంటి సంఘటన ఇది. ఇంతకీ సన్నీ లియోన్ ఏం చెప్పిందంటే.. (Sunny Leone First Love)


Sunny.jpg

‘‘నా భర్త డేనియల్ వెబర్‌ (Daniel Weber) నా జీవితంలోకి రాక ముందు.. నేనొక వ్యక్తిని ఎంతగానో ప్రేమించాను. అతనే నా సర్వస్వం అని భావించాను. మా ఇద్దరికీ నిశ్చితార్థం కూడా అయింది. ఎందుకే నాకు అతను మోసం చేస్తున్నాడని అనిపించి.. రెండు రోజుల్లో పెళ్లి అనగా.. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అని అడిగాను. నీ మీద నాకు ప్రేమ లేదు.. అది ఎప్పుడో పోయిందని అన్నాడు. అంత ఒక్కసారిగా భూమి కంపించినట్లుగా అయింది. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. పెళ్లి వేదికతో పాటు పెళ్లికి సంబంధించిన అన్నింటికీ మనీ పే చేశాను. అన్నీ ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. నా జీవితంలో అత్యంత దుర్భరమైన, దారుణమైన సమయమది. నేనంగానో ప్రేమించిన వాడు.. నేనంటే ఇష్టం లేదని చెప్పేసి వెళ్లిపోయాడు. ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో దేవుడు డేనియల్‌ని నా జీవితంలోకి పంపించాడు. డేనియల్ నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు.. నా వెన్నంటే ఉన్నాడు. ఎప్పటికీ నా భర్త నాతోనే ఉండాలని కోరుకుంటాను. అతని చేయి వదలిపెట్టను ’’ అని సన్నీ లియోన్ ఎమోషనలైంది. (Sunny Leone Love Story)


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

Updated Date - Apr 07 , 2024 | 06:25 PM