Vishal Rathnam: మాస్‌.. ఊర‌మాస్‌! విశాల్ ‘రత్నం’ ట్రైల‌ర్ విడుద‌ల‌

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:01 PM

కాస్త గ్యాప్ త‌ర్వాత విశాల్ న‌టించిన సినిమా ర‌త్నం తాజాగా సోమ‌వారం సాయంత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

Vishal  Rathnam: మాస్‌.. ఊర‌మాస్‌! విశాల్ ‘రత్నం’ ట్రైల‌ర్ విడుద‌ల‌
rathnam

కాస్త గ్యాప్ త‌ర్వాత విశాల్ (Vishal) న‌టించిన సినిమా ర‌త్నం (Rathnam). సింగం సిరీస్ చిత్రాల‌తో స్టార్ డైరెక్ట‌ర్‌గా ఎదిగిన త‌మిళ డైరెక్ట‌ర్‌ హ‌రి (hari) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌గా ప్రియా భ‌వాని శంక‌ర్ (Priya Bhavani Shankar) క‌థానాయిక‌గా న‌టించింది. సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్ర‌సాద్ (DEVI SRI PRASAD) సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం విడుద‌ల‌కు రెడీ అయంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప్ర‌చార చిత్రాలు విడుద‌ల చేయ‌గా సినిమాపై మంచి బ‌జ్‌ను తీసుకువ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తాజాగా (సోమ‌వారం సాయంత్రం) కొద్ది సేప‌టి క్రితం ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

vi.jpeg

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఏపీ, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దులో జ‌రిగే క‌థ నేప‌థ్యంలో ర‌త్నం (Rathnam) సినిమా సాగ‌నున్న‌ట్లు తెలుస్తోండ‌గా అద్యంతం యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో నింపేశారు. హీరోయిన్‌ను హీరో ప్రేమించ‌డం అవ‌త‌లి వ‌ర్గం చేజ్‌లు చేయ‌డం, హీరోయిన్‌పై హ‌త్యాయ‌త్నాలు జ‌ర‌గ‌డం, హీరో వారిని ఎదుర్కొంటూ పోయే దృశ్యాలు ఈ క్ర‌మంలో ఫైటింగ్ సీన్లు ద‌ర్శ‌కుడు హ‌రి (hari) త‌న శైలిలో అదిరిపోయేలా చిత్రీక‌రించారు. స‌ముద్ర‌ఖ‌ని, ముర‌ళీశ‌ర్మ‌ల పాత్ర‌లు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

rath.jpeg


అంతేకాకుండా దేవీ శ్రీ ప్ర‌సాద్ (DEVI SRI PRASAD) బ్యా గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫ‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. ట్రైల‌ర్‌ను చూస్తున్నంత సేపు విశాల్ (Vishal) గ‌త చిత్రాలు పొగ‌రు, పందెం కోడిల‌ను గుర్తుకు తెచ్చేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. ట్రైల‌ర్‌ను చూస్తే సినిమా మాస్ ప్రేక్ష‌కుల‌కు ఫుల్‌మీల్స్ ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ ‘రత్నం’ (Rathnam).సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుద‌ల చేయ‌నున్నారు.

Updated Date - Apr 15 , 2024 | 07:01 PM