Tamannaah: త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నా.. పాట‌లోనే ఫుల్‌మీల్స్‌పెట్టారుగా! చూసినోళ్ల‌కు క‌నుల‌విందు ప‌క్కా

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:51 PM

త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నా. ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం బాక్( అర‌ణ్మై 4). తాజాగా రిలీజ్ చేసిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ నెట్టింట బాగా రచ్చ చేస్తోంది.

Tamannaah: త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నా.. పాట‌లోనే ఫుల్‌మీల్స్‌పెట్టారుగా! చూసినోళ్ల‌కు క‌నుల‌విందు ప‌క్కా
baak

త‌మిళ న‌టుడు ప్ర‌ముఖ న‌టి ఖుష్బూ భ‌ర్త సుంద‌ర్ సీ (Sundar.C ) హీరోగా త‌మ‌న్నా (Tamannaah), రాశీ ఖ‌న్నా (Raashii Khanna) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా అర‌ణ్మై4 (Aranmanai4). ఈ సిరీస్‌లో గ‌తంలో వ‌చ్చిన మూడు చిత్రాల్లో సిద్ధార్థ్‌, ఆర్య‌, త్రిష‌, హ‌న్షిక‌, అండ్రియా వంటి స్టార్లు న‌టించ‌గా ఒక దాన్ని మించి ఒక‌టి మంచి విజ‌యం సాధించాయి. తెలుగులో దృవ చిత్రానికి సంగీతం అందించిన హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు రెడీ అయింది.

thamanna.jpeg

ఈ అర‌ణ్మై4 (Aranmanai4) ఏప్రిల్ 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుండ‌గా తెలుగులో ఎషియ‌న్ ఫిలిమ్స్ రిలీజ్ చేస్తుంది. అయితే సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న సంద‌ర్భంగా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు, టీజ‌ర్‌, టైల‌ర్లు విడుద‌ల‌వ‌గా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ అర‌ణ్మై 4 చిత్రాన్ని బాక్ (Baak) పేరు మీద తెలుగులో విడువద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ చిత్రంలో న‌టిస్తోన్న తెలుగు న‌టులు వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్ రెడ్డిల ఫ‌స్ట్‌లుక్స్ కూడా రెండు రోజుల క్రితం విడుద‌ల చేశారు.

rashi.jpeg


తాజాగా ఈసినిమా నుంచి త‌మ‌న్నా (Tamannaah), రాశీ ఖ‌న్నా (Raashii Khanna)లపై చిత్రీక‌రించిన పంచుకో అంటూ సాగే తెలుగు వెర్ష‌న్ ప్రోమో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయ‌గా క్ష‌ణాల్లో ల‌క్ష‌ల వ్యూస్ సాదిస్తూ దూసుకుపోతుంది. అంతేగాక‌ ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో పెద్ద దుమార‌మే రేపుతుండ‌గా నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నాయి..

GLGtDGWWUAAF_nC.jpeg

ఆ పాట‌లో త‌మ‌న్నా (Tamannaah), రాశీ ఖ‌న్నా (Raashii Khanna) ఒక‌రికొక‌రు పోటీ ప‌డి మ‌రి అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌తో రెచ్చి పోయారు. ఈ పాట‌ను చూసిన ప్రేక్ష‌కులు స్ట‌న్ అవుతూ ఆ పాట‌ను ఒక‌టికి రెండు సార్లు వీక్షిస్తూ క‌నులారా ఆస్వాదిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరిప్పుడే చూసేయండి మ‌రి.

taaa.jpeg


ఇవి కూడా చదవండి:

====================

OTT: ఓటీటీలో.. స్ట్రీమవుతున్న‌ అదిరిపోయే క్రైమ్ ఇన్వెష్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్‌! డోంట్ మిస్‌

**********************

Katha Venuka Katha: క‌థ‌క‌న్నా ట్విస్టులే ఎక్కువున్న‌య్‌.. ఇదేం సినిమారా నాయ‌న‌

**********************

Ottలోకి జ‌యం ర‌వి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఎప్ప‌టినుంచంటే!

**********************

Ruhani Sharma: రుహానీ శ‌ర్మ‌.. మ‌రీ ఇంత ప‌చ్చిగానా! అది సినిమానా లేక‌ బ్లూ ఫిల్మా?

Updated Date - Apr 14 , 2024 | 02:00 PM