Ruhani Sharma: రుహానీ శ‌ర్మ‌.. మ‌రీ ఇంత ప‌చ్చిగానా! అది సినిమానా లేక‌ బ్లూ ఫిల్మా?

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:52 PM

ఇటీవ‌ల తెలుగు నాట వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతున్న నాయిక రుహానీ శ‌ర్మ‌. తాజాగా అమె న‌టించిన ఓ హింద‌దీ చిత్ర ట్రైల‌ర్ జాతీయంగా బాగా వైర‌ల్ అవ‌డ‌మే గాక బాగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

 Ruhani Sharma: రుహానీ శ‌ర్మ‌.. మ‌రీ ఇంత ప‌చ్చిగానా! అది సినిమానా లేక‌ బ్లూ ఫిల్మా?
Ruhani Sharma

ప్ర‌ముఖ‌ న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ మొద‌టి సారి మెగాఫోన్ చేత బ‌ట్టి రూపొందించిన చిత్రం చి ల సౌ. విమ‌ర్శ‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అక్కినేని వార‌సుడు సుశాంత్ హీరోగా న‌టించ‌గా నార్త్ బ్యూటీ రుహానీ శ‌ర్మ (Ruhani Sharma) హీరోయిన్‌గా తెలుగునాట ఆరంగేట్రం చేయ‌డంతో పాటు చిత్రంలో న‌ట‌న‌కు గాను అధిక మార్కులు సైతం కొట్టేసింది. తెలుగు నాట కాస్త అభిమానుల‌ను కూడా సంపాదించుకుంది.

Ruhanisharma-3.jpg

ఆ త‌ర్వాత రుహానీ శ‌ర్మ (Ruhani Sharma) క‌థానాయిక‌గా హిట్‌, హ‌ర్‌, నూటొక్క జిల్లాల అంద‌గాడు వంటి సినిమాల‌తో పాటు సైడ్ క్యారెక్ట‌ర్స్‌లో డ‌ర్టీ హ‌రి, మీట్ క్యూట్‌, సైంథ‌వ్‌, ఆప‌రేష‌న్ వాలంటైన్‌ తాజాగా శ్రీరంగ‌నీతులు వంటి సినిమాలు చేసి మెప్పించింది. అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌కు ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌ని ఈ బ్యూటీ ఇప్ప‌డికే ఒక‌టి రెండు హిందీ సీరీస్‌ల‌లో ఇంటిమేట్ స‌న్నివేశాల‌లో న‌టించి ఔరా అనిపించినా తెలుగులో ఆ స్థాయి గ్లామ‌ర్ సినిమాలు ప‌డ‌లేదు, చేయ‌లేదు. అడ‌పాద‌డ‌పా హాట్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారు మ‌తులు పొగొడుతోంది.

Ruhanisharma-2.jpg

అయితే రుహానీ శ‌ర్మ (Ruhani Sharma) 2019లో న‌టించిన ఓ బాలీవుడ్ సినిమా ఆగ్రా (Agra) అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ఇప్పుడు థిమేట‌ర్లలో విడుద‌ల‌య్యేందుకు రెడీ అయింది. గ‌త సంవ‌త్స‌రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌ల‌లో ప్ర‌ద‌ర్శించ‌గా మంచి అప్లాజ్ తెచ్చుకుంది. దీంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపై ప‌డింది. ఈక్ర‌మంలో ఏప్రిల్ 3న ఫ్రాన్స్‌లో సినిమాను విడుద‌ల చేసిన క్ర‌మంలో చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌గా అందులో రుహానీ శ‌ర్మ ముద్దు సీన్లు, ఇంటిమేట్‌ సీన్ల‌ను చూసి ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.

ruhani.jpg


అస‌లు అందులో న‌టించింది రుహానీ శ‌ర్మేనా (Ruhani Sharma) మ‌రి ఇంత ప‌చ్చిగా బోల్డ్‌ సీన్ల‌లో న‌టించిందేంటంటూ నోరెళ్ల బెడుతున్నారు. చాలామంది నెటిజ‌న్లు రుహ‌నీ శ‌ర్మ‌కు ఎందుకీ ఖ‌ర్మ‌.. అలాంటి స‌న్నివేశాల‌లో న‌టిచాల్సిన అవ‌స‌ర‌మేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందం ఉంది, అభిన‌మయం ఉంది , పైగా తెలుగులో ఛాన్సులు మంచిగానే వ‌స్తున్నాయ్ క‌దా శృతి మించి మ‌రీ అలాంటి శృంగార స‌న్నివేశాలలో చేయాల్సిన అవ‌స‌ర‌మేమొచ్చిందంటూ ఆమె అభిమానులు ఫీల‌వుతున్నారు. ఇదిలాఉండ‌గా ఈ స‌న్నివేశాల గురించి రుహానీ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడి స‌హ‌కారంతోనే ఆ సీన్‌లో న‌టిచ‌గ‌లిగాన‌ని, ఆ సినిమా త‌ర్వాత నా సినిమాల ఎంపిక‌లోనూ మంచి మార్పు వ‌చ్చిందంటూ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెబుతూ రావ‌డం గ‌మ‌నార్హం.

agra.jpg

ఇటీవ‌ల తెలుగులో వ‌చ్చిన మంగ‌ళ‌వారం సినిమాలో క‌థానాయిక‌ ఓ సిండ్రోమ్‌తో బాధ ప‌డుతూ తీవ్ర‌మైన కోరిక‌ల‌తో కంట్రోల్ త‌ప్పే త‌ర‌హాలోనే ఓ సాధార‌ణ మ‌నిషి కోరిక‌ల ప్ర‌స్టేష‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఈ ఆగ్రా (Agra) సినిమాను కనుబెల్ తెర‌కెక్కించ‌గా మోహిత్ అగ‌ర్వాల్ (Mohit Agarwal) హీరోగా న‌టించాడు. నాటి త‌రం యూత్ హార్ట్ త్రోబ్ రాహుల్ రాయ్ (rahul roy) చాలా కాలం త‌ర్వాత ఈ సినిమాలో న‌టించ‌డం విశేషం. రుహానీ శ‌ర్మ (Ruhani Sharma), అంచ‌ల్ గో స్వామి (Aanchal Goswami), ప్రియాంకా బోస్ (Priyanka Bose) ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. అయితే ఈ సినిమా మ‌న దేశంలో విడుద‌ల‌కు సంబంధించి ఇంత‌వ‌ర‌కు ఎలాంటి స‌మ‌మాచారం లేదు. దీంతో ఈ చిత్రం ఇక్క‌డ రిలీజ‌వుతుందా అనే డౌటానుమానాలు గ‌ట్టిగానే ఉన్నాయి.

ruhanisharma1.jpg

Updated Date - Apr 12 , 2024 | 06:00 PM