AyeshaKhan: ఎవరీ అయేషా ఖాన్?.. ఇప్పుడు యూత్‌ను ఊపేస్తోంది

ABN , Publish Date - Mar 27 , 2024 | 09:36 PM

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల‌ యూత్‌ను ఊపేస్తున్న ఒకే ఒక్క‌ పేరు అయేషా ఖాన్. చేసిన మొద‌టి సినిమా ట్రైల‌ర్‌లో క‌నిపించిన రెండు సెక‌న్ల వీడియోతో ఓవ‌ర్ నైట్‌లో యూత్ క‌ల‌ల రాణిగా మారింది.

AyeshaKhan: ఎవరీ అయేషా ఖాన్?.. ఇప్పుడు యూత్‌ను ఊపేస్తోంది
ayesha

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల‌ యూత్‌ను ఊపేస్తున్న ఒకే ఒక్క‌ పేరు అయేషా ఖాన్ (Ayesha Khan). చేసిన మొద‌టి సినిమా ట్రైల‌ర్‌లో క‌నిపించిన రెండు సెక‌న్ల వీడియోతో ఓవ‌ర్ నైట్‌లో యూత్ క‌ల‌ల రాణిగా వీప‌రీత‌మైన ఫాలోయింగ్‌ను తెచ్చుకుందంటే అతిశ‌యోక్తి కాదు.

Ayesha Khan 2.jpeg

ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా వెతుకుతున్న పేరేవ‌రిదైనా ఉందా అంటే ఈ ముంబ‌య్ ముద్దుగుమ్మ‌దే అయి ఉంటుంది. అంత‌లా ఈ అమ్మ‌డు కుర్ర‌కారును డిస్ట‌ర్బ్ చేసింది. కొంత కాలం ఈ టాలీవుడ్‌ను ఊపేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ayesha khan.jpeg

వివ‌రాళ్లోకి వెళితే 2020లో వ‌చ్చిన హిందీ సిరీస్ బాల్ వీర్‌లో చిన్న పాత్ర‌లో క‌నిపించిన ఈ చిన్న‌ది అయేషా ఖాన్ (Ayesha Khan) త‌ర్వాత ఏకంగా విశ్వ‌క్ సేన్ గెస్ట్ రోల్ చేసిన ముఖ‌చిత్రం సినిమాలో రెండో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది గానీ అదో సినిమా వ‌చ్చిన సంగ‌తే జ‌నాల‌కు తెలియ‌దు.

Ayesha Khan 7.jpeg

ఆ త‌ర్వాత 2023 లో స్టార్ట్ అయిన హిందీ బిగ్‌బాస్ 17 లో కంటెస్టెంట్‌గా జాయిన్ అయి ఓ మోస్త‌రు గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగులో ఓం భీం భుష్ (Om Bheem Bush) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఒక్క‌సారిగా టాలీవుడ్‌ను షేక్ చేసింది.


ముఖ్యంగా ఓం భీం భుష్ సినిమా విడుద‌ల‌కు ముందు రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌లో ప‌ల్లెటూరి ప‌డుచు వేషంలో హాట్ లుక్‌లో రెండు మూడు సెక‌న్లు మాత్ర‌మే క‌నిపించి అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకునేలా చేసింది అయేషా ఖాన్ (Ayesha Khan). ఆపై సినిమా విడుద‌లయయ్యాక అందులో ఆమె గ్లామ‌ర్ కు కుర్ర‌కారు ఫిదా అయిపోయారు.

Ayesha Khan 6.jpeg

ఆ వెంట‌నే విశ్వ‌క్ సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి (Gangs Of Godavari ) సినిమా నుంచి విడుద‌లైన పాట ఆమె క్రేజ్‌ను మ‌రింత‌గా పెంచేశాయి. ప‌డుకున్న ముస‌ళోల్లు సైతం ఊరుకులు పెట్టించేలా ఈ అమ్మడు అ పాట‌లో త‌న అందాల విందును పంచింది.

Ayesha Khan 9.jpeg

దీంతో ఇప్పుడు ఈ పాట యూ ట్యూబ్‌లో దూసుకుపోతుండ‌గా సోష‌ల్ మీడియాల్లోనూ ఈ పాటే ట్రెండింగ్‌లో ఉంది. మీరు ఇంత‌వ‌రకు చూడ‌లేదా ఇప్పుడే చేసి ఆస్వాధించండి మ‌రి.

Updated Date - Mar 27 , 2024 | 09:54 PM