OTT: ఓటీటీలో.. స్ట్రీమవుతున్న‌ అదిరిపోయే క్రైమ్ ఇన్వెష్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్‌! డోంట్ మిస్‌

ABN , Publish Date - Apr 10 , 2024 | 12:56 PM

ఇటీవ‌ల డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఓ మ‌ల‌యాళ సినిమా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌న‌కు తెలియ‌ని న‌టులే అధికంగా న‌టించిన ఈ చిత్రం జ‌నాల‌ను అశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

OTT: ఓటీటీలో.. స్ట్రీమవుతున్న‌ అదిరిపోయే క్రైమ్ ఇన్వెష్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్‌! డోంట్ మిస్‌
Adhrushyam

ఇటీవ‌ల డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఓ మ‌ల‌యాళ (Malayalam) సినిమా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఏ మాత్రం భారీ తారాగ‌ణం, పేరు, పరిచ‌యం ఉన్న ఒక‌రిద్ద‌రు మిన‌హ అంతగా మ‌న‌కు తెలియ‌ని న‌టులే అధికంగా న‌టించిన ఈ చిత్రం జ‌నాల‌ను అశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. చివ‌ర‌కు మంచి థ్రిల్ల‌ర్ సినిమా చేశామ‌నే ఫీలింగ్‌ను ఇస్తోంది. ఈ సినిమా దెబ్బ‌కు ఇక‌పై మ‌ల‌యాళం నుంచి వ‌చ్చే ఏ చిన్న సినిమాను మిస్స‌వ్వొద్దనే అభిప్రాయాన్ని తీసుకువ‌చ్చిందంటే అతిశ‌యోక్తి కాదు. ఆ చిత్ర‌మే అదృశ్యం (Adhrushyam).

bg_ini_utharam.jpg

అప్పుడెప్పెడో క‌రోనా స‌మ‌యంలో వ‌చ్చిన సూర్య అకాశ‌మే హ‌ద్దు రా సినిమాలో క‌థానాయిక‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌టి అప‌ర్ణా బాల ముర‌ళి (Aparna Balamurali). ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో.. 2022లో మ‌ల‌యాళంలో విడుద‌లై ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన‌ ఇని ఉత్త‌రం (Ini Utharam) అనే చిత్రాన్ని ఇప్పుడు అదృశ్యం (Adhrushyam) పేరుతో తెలుగులోకి డ‌బ్ చేసి ఈ టీవీ విన్ (ETV Win) ఓటీటీలో విడుద‌ల చేశారు. హ‌రీశ్ ఉత్త‌మ‌న్, సిద్దిక్‌ కీ రోల్స్‌లో న‌టించిన అఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రానికి సుధీశ్ రామ‌చంద్ర‌న్ (Sudheesh Ramachandran) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా హేషం అబ్దుల్ వాహ‌బ్ (Hesham Abdul Wahab) సంగీతం అందించారు.


ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ మ‌నిషిని చంపి పాతిపెట్టానంటూ జాన‌కి అనే డాక్ట‌ర్ స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేస్తుంది. కానీ పొలీసులు లైట్‌గా తీసుకుంటారు.. ఈ స‌మాచారం మీడియాకు చేర‌గా వారిముందే కంప్లైంట్ చేసిన మ‌హిళకు మ‌తి స్థిమ‌తం లేద‌ని నోరు జారుతారు. ఇది విన్న జాన‌కి నేను చంపిన వారిని ఎక్క‌డ పూడ్చింది చూపిస్తానంటూ అడ‌విలోకి తీసుకెళుతుంది. విష‌యం తెలుసుకున్న ఊరి జ‌నాల‌తో పాటు మీడియా, పోలీసులు అక్క‌డికి భారీగా చేరుకుంటారు. అక్క‌డ ఓ ప్రాంతంలో తవ్వ‌గా రెండు శ‌వాలు బ‌య‌ట ప‌డ‌తాయి. ఈ స‌మ‌యంలో వారిని నేను చంప‌లేదు అక్క‌డే ఉన్న ఓ పోలీస్ అధికారి చంపాడంటూ జాన‌కి ఓ షాకింగ్ విష‌యం బ‌య‌ట పెడుతుంది. ఆ త‌వ్విన ప్ర‌దేశంలో అందుకు సంబంధించిన అధారాలు కూడా ల‌భిస్తాయి..

etv.jpeg

దీంతో SP రంగంలోకి దిగి ఇంటారాగేష‌న్ మొద‌లుపెట్ట‌గా ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి ఇంట్రెస్టింగ్ విష‌యాలు బ‌య‌ట ప‌డుతూ ఉంటాయి.. చివ‌ర‌కు ఆ కేసు అధికారంలో ఉన్న‌ ఓ మంత్రి వ‌ర‌కు వెళుతూ సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్లింగ్‌ను ఇస్తుంది. ఇంత‌కు చ‌నిపోయింది ఎవ‌రు.. జాన‌కికి చ‌నిపోయిన వారికి, ఆ క్రిమిన‌ల్ మ‌ధ్య ఉన్న లింకేంటి, SP ఎలా వ్య‌వ‌హ‌రించాడు, క‌థానాయికకు చివ‌ర‌కు ఏమైంది, అస‌లు నేర‌స్థుల‌ను ఏ విధంగా ప‌ట్టుకున్నారు అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో చివ‌రివ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌ ట్విస్టుల మీద ట్విస్టుల‌తో సాగుతూ చాన్నాళ్ల‌కు ఓ మంచి క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా చేసే ఫీల్ మ‌న‌కు ఇవ్వ‌డం గ్యారంటీ.. ఇకెందుకు ఆల‌స్యం మీరు ఇప్పుడే చూసేయండి మ‌రి.

Updated Date - Apr 10 , 2024 | 01:23 PM